Baa Baa Black Sheep: అక్టోబర్ 9న ‘బా బా బ్లాక్ షీప్’

Blacksheep

Blacksheep

చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దోనేపూడి నిర్మాణంలో, గుణి మంచికంటి దర్శకత్వంలో రూపొందుతున్న సరికొత్త న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘ఆజా మేరీ జాని’ని రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) ఘనంగా విడుదల చేశారు. అంతేకాకుండా ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 9న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.  అక్షయ్ లగుసాని, విష్ణు ఓయ్‌లపై ఎంతో కలర్‌ఫుల్‌గా చిత్రీకరించిన ఈ ఎనర్జిటిక్ పార్టీ సాంగ్ యూత్‌ను ఆకట్టుకుంటోంది. ఎలక్ట్రానిక్ కిలి, ఆనంద్ (ఆర్కాడొ) సంయుక్తంగా స్వరపరిచిన ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ క్యాచీ సాహిత్యం అందించగా, ప్రముఖ గాయకుడు బెన్నీ దయాల్ తనదైన హై-వోల్టేజ్ గాత్రంతో ప్రాణం పోశారు. పాట చాలా బాగుందని, వినూత్నమైన కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా ఘన విజయం సాధించాలని దేవిశ్రీ ప్రసాద్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సినిమాకు సంబంధించిన కీలక విశేషాలను నిర్మాత వేణు దోనేపూడి పంచుకున్నారు. మేఘాలయ రాష్ట్రంలో, ముఖ్యంగా చిరపుంజి వంటి అద్భుతమైన లొకేషన్లలో పూర్తిగా చిత్రీకరణ జరుపుకున్న తొలి సౌత్ ఇండియన్ సినిమా ఇదే కావడం విశేషం. షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశకు చేరుకుంది. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 9న చిత్రాన్ని భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, కార్తికేయ, విస్మయశ్రీ, మాళ్వీ మల్హోత్రా, రాజా రవీంద్ర, అనీష్ కురివిల్లా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.