Baa Baa Black Sheep: అక్టోబర్ 9న ‘బా బా బ్లాక్ షీప్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దోనేపూడి నిర్మాణంలో, గుణి మంచికంటి దర్శకత్వంలో రూపొందుతున్న సరికొత్త న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘ఆజా మేరీ జాని’ని రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) ఘనంగా విడుదల చేశారు. అంతేకాకుండా ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 9న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అక్షయ్ లగుసాని, విష్ణు ఓయ్‌లపై ఎంతో కలర్ఫుల్గా చిత్రీకరించిన ఈ ఎనర్జిటిక్ పార్టీ సాంగ్ యూత్‌ను ఆకట్టుకుంటోంది. ఎలక్ట్రానిక్ కిలి, ఆనంద్ (ఆర్కాడొ) సంయుక్తంగా స్వరపరిచిన ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ క్యాచీ సాహిత్యం అందించగా, ప్రముఖ గాయకుడు బెన్నీ దయాల్ తనదైన హై-వోల్టేజ్ గాత్రంతో ప్రాణం పోశారు. పాట చాలా బాగుందని, వినూత్నమైన కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా ఘన విజయం సాధించాలని దేవిశ్రీ ప్రసాద్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సినిమాకు సంబంధించిన కీలక విశేషాలను నిర్మాత వేణు దోనేపూడి పంచుకున్నారు. మేఘాలయ రాష్ట్రంలో, ముఖ్యంగా చిరపుంజి వంటి అద్భుతమైన లొకేషన్లలో పూర్తిగా చిత్రీకరణ జరుపుకున్న తొలి సౌత్ ఇండియన్ సినిమా ఇదే కావడం విశేషం. షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశకు చేరుకుంది. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 9న చిత్రాన్ని భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, కార్తికేయ, విస్మయశ్రీ, మాళ్వీ మల్హోత్రా, రాజా రవీంద్ర, అనీష్ కురివిల్లా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
తాజావార్తలు
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!