AAY FirstLook : ఆసక్తికరంగా ఆయ్ మేం ఫ్రెండ్సండి ఫస్ట్ లుక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GA2 పిక్చర్స్, బన్నీవాస్, విద్యా కొప్పినీడి, నార్నే నితిన్, అంజి కంచిపల్లి కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఫన్ ఎంటర్‌టైనర్ ‘ఆయ్’ ఫస్ట్ లుక్ రిలీజ్ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక సంస్థ GA2 పిక్చర్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.9గా రూపొందుతోన్న చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కంచిపల్లి ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు.
Also Read: Manjummel Boys: తెలుగులో పెద్ద బ్యానర్లకి షాకిచ్చిన మలయాళ మంజుమ్మెల్ బాయ్స్ టీం
Also Read
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
- Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
- Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
- Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
ఇప్పటికే సిినిమా షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. రీసెంట్‌గా టైటిల్ రివీల్‌కు సంబంధించిన కాన్సెప్ట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవటమే కాకుండా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకుంది. ఈ క్రమంలో గురువారం రోజున మేకర్స్ ‘ఆయ్’ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గమనిస్తే నార్నే నితిన్ తన స్నేహితులతో కనిపిస్తున్నారు. రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ ఇందులో హీరో ఫ్రెండ్స్ పాత్రల్లో నటించారు. మరో వైపు పచ్చదనంతో కూడిన సరస్సుని కూడా చూపిస్తున్నారు. అంటే ఈ చిత్రంలో ప్రకృతి కూడా ఓ ప్రముఖ పాత్రలో కనిపించనుందని తెలుస్తుంది.
‘ఆయ్’ అనే టైటిల్‌ను గమనిస్తే ఇది గోదావరి ప్రాంతవాసులు సాధారణంగా వాడే ఓ పదం. ఈ ఆసక్తికరమైన ఫస్ట్ లుక్‌ను గమనిస్తుంటే అందమైన గోదావరి యొక్క నేపథ్యానికి వ్యతిరేకంగా ఆకర్షణీయమైన కథనాన్ని తెలియజేస్తోంది. ఈ ‘ఆయ్’ చిత్రాన్ని వేసవిలో విడుదల చేస్తామని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ‘డ్రిజ్‌లింగ్ సమ్మర్’ అంటూ రిలీజ్ విషయాన్ని ఫస్ట్ లుక్ పోస్టర్‌లోనూ తెలియజేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకోవటమే కాదు, మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ని ఉంటుందని తెలియజేస్తోంది.
Also Read: Ram Charan-Upasana: నా భార్య కావడం వలనే ఉపాసనకు గుర్తింపు రాలేదు: రామ్ చరణ్
ఫన్ రైడర్‌గా తెరకెక్కుతోన్న ‘ఆయ్’ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందని మేకర్స్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రం కోసం అత్యుత్తమమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు పని చేశారు. అలాగే సినిమాకు కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా, సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్‌గా, రామ్ మిర్యాల సంగీత దర్శకుడిగా వర్క్ చేశారు. త్వరలోనే మరిన్ని ఎగ్జయిటింగ్ డీటెయిల్స్ ను చిత్ర యూనిట్ ప్రకటించనుంది.
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!