నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “జెర్సీ” చిత్రంపై ఓ ఆస్ట్రేలియా జర్నలిస్ట్ ప్రశంసలు కురిపించడం విశేషంగా మారింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ స్పోర్ట్స్ అండ్ ఎమోషనల్ డ్రామాకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి సైతం మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం 67వ జాతీయ చలన చిత్ర అవార్డులలో రెండు జాతీయ అవార్డులను సాధించింది ఈ మూవీ. ఇది రెండు విభాగాలలో ఒకటి ఉత్తమ ఎడిటింగ్, మరొకటి ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం హిందీలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే.
Read Also : బన్నీ ఫాన్స్ మామూలోళ్ళు కాదు.. ప్రధమ స్థానంలోకి ‘పుష్ప’!
తాజాగా ఓ ఆస్ట్రేలియా జర్నలిస్ట్ నాని “జెర్సీ”పై ప్రశంసలు కురిపించడంతో ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ అమండా బెయిలీ “జెర్సీ” చిత్రం అద్భుతమంటూ ట్వీట్ చేశారు. “నేను జెర్సీని చూశాను! ఎంతటి భావోద్వేగ ప్రయాణం. మేకర్స్ మిమ్మల్ని ఈ చిత్రంలో అద్భుతంగా తీర్చిదిద్దారు. నాని గుడ్ జాబ్. మీరు అతనితో నవ్వుతారు, అతనితో ఏడుస్తారు. ఇందులో నాకు రైల్వే స్టేషన్ సన్నివేశం బాగా నచ్చింది”అని ఆమె ట్వీట్ చేశారు.
I watched Jersey! What an emotional journey. The creators did a brilliant job of drawing you in – you back Arjun’s dreams as much as him.
— Chloe-Amanda Bailey (@ChloeAmandaB) June 26, 2021
Nani did a beautiful job. You smile with him, you cry with him. My favourite scene is at the train station – my fear turned to elation. 😍