August 15 Release Heroines With Mumbai Background: సాధారణంగా సినిమాలు శుక్రవారం నాడు రిలీజ్ అవుతాయి కానీ ఆగస్టు 15వ తేదీ పబ్లిక్ హాలిడే రావడంతో ఆ రోజునే దాదాపు మూడు సినిమాలతో పాటు ఒక సినిమా ప్రీమియర్స్ కూడా ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాతో పాటు మిస్టర్ బచ్చన్, తంగలాన్ అనే డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరోపక్క 16వ తేదీ రిలీజ్ అవుతున్న ఆయ్ అనే సినిమా ప్రీమియర్స్ కూడా ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు. రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా సూపర్ హిట్ అయింది. అదే సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన కావ్య తాపర్ పుట్టి పెరిగింది ముంబైలోనే. అలా ఆమెకు ముంబై భామ అనే టాగ్ పడిందని చెప్పొచ్చు. ఇక మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజ హీరోగా నటిస్తుండగా హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న భాగ్యశ్రీ బోర్సేది కూడా ముంబై. ఆమె స్వతహాగా మరాఠీ కానీ చిన్నప్పుడే తండ్రి ఉద్యోగరీత్యా నైజీరియాలో కొన్నాళ్లు ఉన్నా డిగ్రీ చదివేందుకు ముంబై వచ్చి మోడలింగ్ మొదలుపెట్టి అనుకోకుండా తెలుగు సినిమాలో హీరోయిన్ అయిపోయింది.
Venu Swamy : వేణు స్వామీ… ఓసారి జాతకం చూపించుకోండి..!!
కాబట్టి ఆ మీద కూడా ముంబై భామనే అని చెప్పాలి. ఇక మరోపక్క ఎన్టీఆర్ బామ్మర్ది నార్ని నితిన్ హీరోగా నయన్ సారిక హీరోయిన్ గా ఆయ్ అనే సినిమా తెరకెక్కింది. బన్నీ వాసు నిర్మాణంలో ఈ సినిమాని అంజి డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన నయన్ సారికది కూడా ముంబైనే. ఆమె కూడా మరాఠీ భామనే. మరొకపక్క తంగలాన్ అనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. విక్రమ్ హీరోగా నటించిన ఈ సినిమాలో పార్వతి హీరోయిన్గా నటించింది. మాళవిక మోహనన్ అనే కూడా మరో హీరోయిన్ గా నటించింది. వీరిలో మాళవిక మోహనన్ ది కూడా ముంబై అనే చెప్పాలి. ఆమె తండ్రి మోహనన్ ఒక ప్రముఖ సినిమాటోగ్రాఫర్. ఆయన కేరళకు చెందిన వ్యక్తి అయినా వృత్తి రీత్యా ముంబైలో సెటిల్ అయ్యాడు కాబట్టి ఆమె కుమార్తె ముంబై భామనే అని చెప్పాలి. అలా ఈ వారం రిలీజ్ అవుతున్న దాదాపు అన్ని సినిమాల హీరోయిన్స్ ముంబై బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం.