Site icon NTV Telugu

Attitude Star : ఆటిట్యూడ్ స్టార్ పై ట్రోలింగ్ వల్ల చాలా బాధపడ్డాం : ప్రభాకర్

Untitled Design (38)

Untitled Design (38)

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటిస్తున్న సినిమా “రామ్ నగర్ బన్నీ”. విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 4వ తేదీన “రామ్ నగర్ బన్నీ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

Also Read : Devara : దేవర ఓవర్సీస్ లేటెస్ట్ కలెక్షన్స్.. రికార్డులు తిరగరాస్తున్నJr. NTR

ప్రభాకర్ మాట్లాడుతూ –  మా అబ్బాయిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నప్పుడు నాకున్న ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకున్నాం. చంద్రహాస్ మొదటి సినిమా సకుటుంబంగా ప్రేక్షకులు చూడాలని అనుకున్నాం. చంద్రహాస్ మీద ట్రోలింగ్స్ వచ్చినప్పుడు మేమంతా బాధపడిన మాట వాస్తవమే. అయితే ఆ ట్రోలింగ్స్ ను చంద్రహాస్ పాజిటివ్ గా తీసుకున్నాడు. తనలో ఏవైనా లోపాలు ఉంటే సరిచేసుకుంటూ తనకు తాను ఎక్సీపిరియన్స్ చేసి ఎదుగుతున్నాడు. రీసెంట్ గా వరద బాధితుల కోసం తన వంతుగా సాయం చేశాడు. ఖమ్మం జిల్లా వెళ్లి నిత్యావసర వస్తువులు అందించాడు. రామ్ నగర్ బన్నీ లాంటి సినిమాను మాకు ఇచ్చిన డైరెక్టర్ శ్రీనివాస్ మహత్ కు థ్యాంక్స్ చెబుతున్నా. నేను ఇండస్ట్రీలో సంపాదించిందిన డబ్బుతో రామ్ నగర్ బన్నీ చేశా. నటుడిగా నా కొడుకులోని ప్యాషన్ చూసే సినిమా నిర్మాణానికి ముందుకొచ్చా. అతను గొప్ప స్థాయికి వెళ్తాడని నమ్మకం ఉంది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే ఎక్కడా వల్గారిటీ ఉండదు. కుటుంబ ప్రేక్షకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా సినిమా చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. అక్టోబర్ 4న థియేటర్స్ కు వెళ్లి మా మూవీ చూడండి’ అని అన్నారు.

Exit mobile version