Site icon NTV Telugu

Atlee Kumar : ఇద్దరు బడా స్టార్స్ తో అట్లీ భారీ మల్టీస్టారర్.. ఎవరెవరంటే..?

Untitled Design (9)

Untitled Design (9)

ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు స్టార్ హీరోస్ కనిపిస్తే అభిమానులకు ఇక పండగే. గాడ్ ఫాదర్ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవిని.. బాలీవుడ్ బాస్ సల్మాన్ ఖాన్ ని ఒకే ఫ్రేమ్ లో చూపించాడు దర్శకుడు మోహన్ రాజా. విక్రమ్ సినిమాలో లో లాస్ట్ 10నిమిషాల ముందు రోలెక్స్ పాత్రలో సూర్య ఎంతటి సంచలనం చేసాడో చూసాం. అటువంటి క్రేజీ కాంబినేషన్ మరోటి సెట్స్ పైకి వెళ్లనుంది.

Also Read: Naga Vamsi : వరద భాదితులకు త్రివిక్రమ్, నాగవంశీ, చినబాబు విరాళం..

షారుక్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనె, నయన తార కీలక పాత్రలు చేసిన సినిమా జవాన్. ఈ సినిమాకి అట్లీ దర్శకుడిగా వ్యవహరించారు. అట్లీ రూపొందించిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిన విషయమే. ఇప్పుడు మళ్లీ ఓ భారీ మల్టీ స్టారర్‌ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధం అయ్యారు అట్లీ. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ కోసం స్టార్ హీరోస్ కమల్‌ హాసన్, సల్మాన్‌ ఖాన్‌లను రంగంలోకి దించినట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఇదే నిజమైతే బాక్సాఫీస్ బద్దలవడం ఖాయం.

Also Read: 35Movie : టాలీవుడ్ టాప్ హీరో మెచ్చిన సినిమా ’35 చిన్న కథ కాదు’: నిర్మాత సృజన్

ప్రస్తుతం ఈ భారీ ప్రాజెక్ట్ కోసం సల్మాన్, కమల్‌తో చర్చలు జరుపుతున్నారు అట్లీ. వీరిద్దరూ ఇందులో నటించడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఇంతకు ముందు ఎన్నడూ చూడని భారీ యాక్షన్‌ చిత్రంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు దర్శకుడు. త్వరలో కథను పూర్తి చేసి అక్టోబరులో ప్రీ ప్రొడక్షన్ పనుల్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది దీన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారని అట్లీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అన్ని అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం స్టార్ట్ అవుతుంది

Exit mobile version