NTV Telugu Site icon

Allu Arjun : అట్లీ – అల్లు అర్జున్ రెడీ టు రూల్..

Atlee

Atlee

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య వచ్చిన పుష్ప2 సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఫైనల్‌గా రూ. 1871 కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు తిరుగు లేని విజయాన్ని అందించింది. అంతేకాదు హిందీలో బన్నీకి భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. దీంతో పాన్ ఇండియా లెవల్లో అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. నిజానికైతే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా ప్రకటించాడు బన్నీ. కానీ అనూహ్యంగా త్రివిక్రమ్ సినిమా వెనక్కు వెళ్ళింది.

Also Read : Pooja Hegde : తమిళ్ లో స్టార్ హీరోలతో జోడీ కడుతోన్న పూజాహెగ్డే

త్రివిక్రమ్ సినిమాకు మధ్యలో తమిళ్ డైరెక్టర్ అట్లీ ప్రాజెక్ట్ వచ్చి చేరింది. త్రివిక్రమ్ సినిమా స్క్రిప్ట్ వర్క్ దశలో ఉందని ఆలోగా అట్లీతో  సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట బన్నీ. అట్లీ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే సెట్స్  రానున్న ఉగాది రోజున బన్నీ కొత్త సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ రానుందని సమాచారం. బన్నీతో సినిమా కోసం అట్లీ టీమ్ రెడీ అవుతుందట. ఈ సినిమా కోసం ఇప్పటీ మ్యూజిక్ డైరెక్టర్ ను కూడాఫిక్స్ చేసాడట అట్లీ. తమిళ లేటెస్ట్ సెన్సేషన్ అభయంకర్ సంగీతం అందించబోతున్నాడని చెన్నై వర్గాల టాక్. ఈ సినిమా కోసం బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ పేరు పరిశీలిస్తున్నారట మేకర్స్. ఆల్మోస్ట్ జాన్వీ ఫిక్స్ చేసేసారని కూడా వినికిడి. అట్లీ, అల్లు అర్జున్ కాంబో మాస్ ఫీస్ట్ గా ఉండబోతుందని ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇస్తుందని ఇన్ సైడ్ టాక్.