Site icon NTV Telugu

Athadu Re-Release: ట్రెండింగ్‌లో ‘అతడు’ మూవీ.. ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు, 24 గంటల్లోనే..!

Athadu Re Release

Athadu Re Release

Athadu Re-Release Trends: టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘అతడు’ కూడా ఒకటి. ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ప్రభంజనం సృష్టించింది. పెర్ఫామెన్స్, కథ, పాటలు, డైలాగ్స్.. ఇలా అన్నీ అద్భుతంగా ఉండడంతో ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. 2005లో విడుదలైన అతడు సినిమా.. మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

అతడు మూవీ ఫిబ్రవరి 28న రీ-రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం (ఫిబ్రవరి 14) బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతున్న ఈ చిత్రానికి గత 24 గంటల్లోనే 5.4 వేల టికెట్లు బుక్ కావడం విశేషం. పాత సినిమా అయినప్పటికీ ప్రేక్షకులు ఇంకా ఆసక్తిగా చూస్తుండటం అతడు క్రేజ్ తగ్గలేదని చెప్పడానికి ఓ నిదర్శనం. మహేష్ బాబు ఫాన్స్ ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు.

Also Read: IND vs ZIM Playing 11: సంజూ శాంసన్‌కు లైన్ క్లియర్.. అక్షర్ ఇన్, తిలక్‌కు డిమోషన్!

సుమారు 2 గంటల 52 నిమిషాల నిడివి ఉన్న అతడు చిత్రం యాక్షన్, థ్రిల్లర్ అంశాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. యూ సర్టిఫికేట్‌తో 2005 ఆగస్టు 10న విడుదలైన ఈ సినిమా.. అప్పట్లోనే కాక ఇప్పటికీ అదే ఉత్సాహంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా కథలోని సస్పెన్స్, యాక్షన్ సన్నివేశాలు సినిమాను క్లాసిక్‌గా నిలబెట్టాయి. టీవీల్లో అతడు మూవీ ఎన్నోసార్లు వచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ థియేటర్లో చూస్తే.. ఆ కిక్కే వేరు. అందుకే భారీగా టికెట్స్ బుక్ అవుతున్నాయి.

Exit mobile version