సూపర్ స్టార్ మహేశ్ సినిమాలలో ‘అతడు’ సినిమాకు ఉండే క్రేజ్ వేరు. త్రివిక్రమ్ దర్శకత్వంలో 2005 లో వచ్చిన ఈ సినిమాలో పార్థుగా మహేశ్ సెటిల్డ్ ప్ఫరామెన్స్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. మహేశ్ స్టైల్ పంచ్ లు, బ్రహ్మీ కామెడీ, త్రివిక్రమ్ టేకింగ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే బుల్లి తెరపై అత్యధిక సార్లు ప్రసారం అయిన సినిమాగా అతడు పేరిట రికార్డ్ నెలకొల్పింది. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత అతడు మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు.
Also Read : Tollywood : లిక్కర్ స్కాం నిందితుడు వెంకటేష్ నాయుడుతో స్పెషల్ జెట్ లో తమన్నా..
టాలీవుడ్ లో రీరిలీజ్ సినిమాల ట్రెండ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు పోకిరితో మొదలైంది. ఒక్కడు, మురారి, ఖలేజా రీరిలీజ్ లో భారీ వసూళ్లు రాబట్టాయి. అందులో భాగంగానే సూపర్ స్టార్ మహేశ్ బాబు 50వ బర్త్ డే సందర్భంగా ఆగస్టు 9న ‘అతడు’ 4K క్వాలిటీలో వరల్డ్ వైడ్ గా రీరిలీజ్ కానుంది. అందుకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే ఇన్నేళ్ల తర్వాత కూడా అతడు క్రేజే ఏమాత్రం తగ్గలేదనిపిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో అతడు బుకింగ్స్ రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాల కంటే బాగున్నాయంటే అతడు ట్రెండ్ ఎలా ఉందనేది అర్ధం చేసుకోవచ్చు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ అతడు బుకింగ్స్ లో జోరు చూపిస్తోంది. ఘట్టమనేని అభిమానులతో పాటు ప్రేక్షుకులు కూడా ఈ సినిమాను 70MM స్క్రీన్ పై చూడాలని ఎదురుచూస్తున్నారు. నైజాంలో ఈ సినిమాను ఏషియన్ విడుదల చేస్తుండగా ఏపీలో ఏరియాల వారీగా పోటీ పడి మరి భారీ ధరకు అతడు రీరీరిలీజ్ హక్కులు కొనుగులు చేసారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ సినిమా రీరిలీజ్ థియేట్రికల్ రైట్స్ హక్కులు రికార్డ్ స్థాయిలో 3 కోట్లకు పైగా ధర పలికినట్టు సమాచారం. ఒక వైపు బాబు బర్త్ డే మరోవైపు వీకెండ్, సినిమాలు ఏవి లేకపోవడం అతడు రీరిలీజ్ లో రికార్డు స్థాయి నంబర్స్ రాబట్టే అవకాశం ఉంది.
