NTV Telugu Site icon

Savitramma Gari Abbayi: హీరో ఓవరాక్షన్‌.. చెంప చెల్లు మనిపించిన.. వీడియో వైరల్‌..

Chandan Kumar

Chandan Kumar

ఓ సీరియల్‌ హీరో, ఈయన పేరు చందన్ కుమార్. తాజాగా తెలుగులో శ్రీమతి శ్రీనివాస్‌ సీరియల్‌లో హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ ధారావాహిక షూటింగ్‌ సందర్భంగా హీరో ఓవరాక్షన్ చేశాడు. నానా రభస చేయడమే కాకుండా.. షూటింగ్ వర్క్ చేస్తున్నటువంటి క్రూను నానాబూతులు తిట్టాడు. హీరో అంటే రౌడీలా ప్రవర్తించడం అనుకున్నట్టున్నాడు బాబు. అక్కడ పనిచేస్తున్న టెక్నిషియన్‌పై నోరుపారేసుకుని వీరలెవెల్లో పోజులిచ్చాడు హీరో గారు.. మన దగ్గరికి వచ్చి పని చేసుకుంటూ మన వాళ్లనే తిడితే ఊరుకుంటామా? హీరో చేసిన హంగామాపై యూనిట్ అంతా తిరగబడ్డారు. తల్లిని ధూషించడం ఏంటని అందరిముందు ఓ టెక్నిషియన్ హీరో చందన్ చెంప చెల్లుమనిపించాడు. దీంతో బుల్లితెర హీరో చందన్‌పై దాడి వీడియో హల్‌చల్‌ చేస్తోంది. పనిచేసే చోటు ఎగస్ట్రాలు చేస్తే అంతే మరి ఎవరైనా ఒకటే కాదా తేడా వస్తే మామ్మూలుగా ఉండదు. టెక్నిషియన్‌ పనిచేస్తే చిన్న వాడైపోతాడా? తనమీద హీరో గిరి చూపించుదాం అనుకున్నాడు పాపం. చివరకు అతనితోనే చెంప చెల్లు మనిపించుకున్నాడు.

read also: Common Wealth Games 2022: కామన్‌వెల్త్‌లో భారత్.. ఇవాళ జరిగే పోటీలు ఇవే..

శ్రీమతి శ్రీనివాస్‌ సీరియల్‌ షూటింగ్‌ సందర్భంగా హీరో పై జరిగిన ఈ ఘటన సర్వత్రా కలకలం రేపింది. టెక్నీషియన్‌ తల్లిని ధూషించినందుకు అందరి ముందు సారీ చెప్పక తప్పలేదు మన హీరో గారికి. ఓ పక్క పరువై పోయి, మరో పక్క రౌడీగా మిగిలిపోయాడు హీరో. తాజాగా ఈ ఘటన జరగ్గా..ఈవీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హీరో చందన్ చాలా ఏళ్లుగా సినీ పరిశ్రమలో యాక్టివ్‌గా ఉన్నారు. కన్నడలో ‘రాధా కళ్యాణ’, ‘లక్ష్మీ బారమ్మ’ వంటి సీరియల్స్‌లో నటించడమే కాకుండా.. రియాల్టీ షోలలో కూడా పాల్గొన్నాడు. అంతేకాదు బిగ్ బాస్ కన్నడ సీజన్ 3 షోకి కంటెస్టెంట్‌ కూడా వెళ్లాడు. చందన్ 2021 లో టీవీ నటి కవితా గౌడను వివాహం చేసుకున్నాడు.

అయితే ఈఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఈహీరో చేసిన పని తన కేరీర్ పై ఎలాంటి ప్రభావం చూపనుందో.. సీరియల్స్ కొనసాగనిస్తారా? లేదా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏదైతేనే ఈ ఘటన హీరో కేరీర్ పై దెబ్బ పడేటట్లే వుంది. చిన్న పెద్ద అనే తారతమ్యం చూసేవారికి ఇలానే జరగాలి అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి హీరో గారి పరిస్థితి ఎలా వుండనుందో?

Kesineni Chinni Meets Vangaveeti Radha: వంగవీటి రాధాతో కేశినేని చిన్ని భేటీ..