Site icon NTV Telugu

AskNidhhi : ఆ రెండు సినిమాలతో మరింత దగ్గరవుతా : నిధి అగర్వాల్

Nidhiagerwal

Nidhiagerwal

రెబెల్ స్టార్ ప్రభాస్ తో రాజా సాబ్ సినిమాతో పాటు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన హరి హర వీరమల్లు వంటి ప్రెస్టీజియస్ మూవీస్ లో నటిస్తోంది అందాల భామ క్యూట్ హీరోయిన్ నిధి అగర్వాల్. ఈ నేపథ్యంలో ఆమె ఆస్క్ నిధి పేరుతో ఛాట్ నిర్వహించింది. నిధి పర్సనల్ విషయాలతో పాటు అలాగే  కెరీర్ కు సంబంధించి నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. మూవీ లవర్స్, అభిమానులు నిధి అగర్వాల్ కు పలు ప్రశ్నలు వేయగా అంతే క్యూట్ గా ఆన్సర్స్ ఇచ్చింది నిధి.

Also Read : Devara : నందమూరి ఫాన్స్ కాలర్ ఎగరేసే న్యూస్..

ఇందులో భాగంగా ప్రభాస్ తో కలిసి నటిస్తున్న రాజా సాబ్ సినిమా సెట్ లో ఎంతో సరదాగా పనిచేశామని, ఈ మూవీ టీమ్ లో ఎంతో డెడికేషన్ ఉందని నిధి అగర్వాల్ తెలిపింది. ఇక పవన్ కల్యాణ్ తో రీసెంట్ గాా ఓ సెల్ఫీ తీసుకున్నానని, త్వరలోనే ఆ సెల్ఫీని సోషల మీడియాలో పోస్ట్ చేస్తానని నిధి ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. తనకు తెలుగు బాగా మాట్లాడటం వచ్చు అని, కేవలం అందరికీ నమస్కారం అనే బ్యాచ్ కాదని ఫన్నీగా ఆన్సర్ చెప్పింది. పీఆర్ మెయింటేన్ చేయడం తనకు కష్టమైన పనిగా అనిపిస్తుందని పేర్కొంది.  వచ్చే ఏడాది తన రెండు మూవీస్ రాజా సాబ్, హరి హర వీరమల్లు రిలీజ్ అవుతాయని, ఆ రెండు చిత్రాలతో  ప్రేక్షకులకు మరింత చేరువవుతానని ఆశాభావం వ్యక్తం చేసింది నిధి అగర్వాల్. ఈ రెండు చిత్రాలతో పాటు మరో సర్ ప్రైజింగ్ మూవీ కూడా ఉందని తెలిపింది.

Exit mobile version