NTV Telugu Site icon

Ashu Reddy : స్టన్నింగ్ లుక్స్ తో అదరగొడుతున్న అషు రెడ్డి..

Whatsapp Image 2023 06 17 At 11.08.34 Am

Whatsapp Image 2023 06 17 At 11.08.34 Am

అషురెడ్డి తన కెరీర్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటుంది.. మరో వైపు సోషల్ మీడియాలో నూ ఎంతో యాక్టివ్ గా కనిపిస్తూ తెగ సందడి చేస్తోంది.కెరీర్ మొదటి లో డబ్ స్మాష్ వీడియోల తో అషురెడ్డి క్రేజ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆమె రూపం స్టార్ హీరోయిన్ సమంత కు దగ్గరగా ఉండటంతో జూనియర్ సమంతగా కూడా గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూ ఎంత సెన్సేషనల్ గా మారిందో చెప్పే పని లేదు.. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో లో ఏకంగా రెండుసార్లు అవకాశం ను దక్కించుకుంది. సీజన్ 3 మరియు ఓటీటీ బిగ్ బాస్ తో ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించింది. ప్రతి టాస్క్ లోనూ ఎంతో యాక్టివ్ గా కనిపించి క్రేజ్ ను దక్కించుకుంది.

బిగ్ బాస్ తరువాత కొద్ది రోజులకే రామ్ గోపాల్ వర్మతో మరో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి ఇంకా సెన్సేషనల్ గా మారింది. ఫలితం గా అమ్మడుకు గట్టిగా ఫాలోయింగ్ కూడా ఏర్పడింది.. దీంతో ఇటు సినిమాలు అలాగే సినిమా ఈవెంట్ల కు సంబంధించి అవకాశాలు కూడా వస్తున్నాయి.తాజాగా అషు రెడ్డి యూఎస్ లో నిర్వహించిన యూఎస్ఏ కాన్సర్ట్ టూర్ లో అయితే పాల్గొంది. అక్కడ జేమర్స్ బ్యాండ్ మ్యూజిక్ ఈవెంట్ ను కూడా నిర్వహించారు. దీనికి హోస్ట్ గా వ్యవరించినట్టు ఆమె చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా అదిరిపోయే అవుట్ ఫిట్ లో మెరిసింది అషు. స్టన్నింగ్ ఫోజులిస్తూ తెగ ఆకట్టుకుంది. ఆ పిక్స్ నెట్టింట బాగా వైరల్ గా మారాయి.ఈ పిక్స్ లో అషురెడ్డి ట్రెండీ మరియు గ్లామరస్ లుక్ లో మెరిసింది.. బ్లాక్ మినీ డ్రెస్ లో హాట్ సిట్టింగ్ ఫోజులిచ్చి అందరిని ఉక్కిరిబిక్కిరి చేసింది. థండర్ థైస్ తో రెచ్చగొడుతుంది. యంగ్ బ్యూటీ గ్లామర్ కు అందరూ ఫిదా అవుతున్నారు.