Site icon NTV Telugu

Ram Gopal Varma: ఇదొక ఆనవాయితీగా మారుతోంది.. సినిమా ఆపడం బ్యాడ్ థింగ్..

Director Ram Gopal Varma

Director Ram Gopal Varma

డైరెక్టర్ రాంగోపాల్‌ వర్మ పంజాగుట్ట పోలీస్టేషన్‌ కు వెళ్లడంతో ఈవార్త కాస్త చర్చనీయంగా మారింది. తన నిర్మించిన సినిమా లడ్కి సినిమాపై నిర్మాత శేకర్ రాజు కోర్టులో ఫిటిషన్ దాఖలు చేశారు. దీంతో సినిమాను అన్ని భాషల్లో నిలుపుదల చేయాలంటూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై స్పందించిన ఆర్జీవీ పంజాగుట్ట పోలీస్టేషన్‌ కు వెల్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేను నిర్మించిన సినిమా లడ్కి ఈ నెల 15 రిలీజ్ అయిందని, దానిపై శేకర్ రాజు అనే వ్యక్తి స్టే తేవడంతో.. సినిమా ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేసారు. హ్యాండ్ లోన్ తీసుకుని ఇవ్వడం లేదని శేఖర్ రాజు తనపై ఆలిగేషన్ పెట్టి, కోర్ట్ ను తప్పుదారి పట్టించి శేఖర్ రాజు స్టే తీసుకున్నాడని ఆరోపించారు.

తప్పుడు పత్రాలను సృష్టించి కోర్టులో కేసు వేశారని మండిపడ్డారు. దానికి సంబందించిన ఆధారాలు పంజాగుట్ట పోలీసులకు అందించానని పేర్కొన్నారు. ఇదొక ఆనవాయితీగా గా మారుతోందని, సినిమా ఆపడం అనేది బ్యాడ్ థింగ్ అని రాంగోపాల్‌ వర్మ చొప్పుకొచ్చారు. ఇలాంటి మరోసారి పునరావృతం అవ్వొద్దు అని పంజాగుట్ట పీఎస్ లో కేసు పెట్టానని వర్మ పేర్కొన్నారు. ఈ సినిమా ఆగడం వల్ల ఎవరెవరికి ఎంత నష్టం వచ్చింది వారందరూ శేఖర్ రాజు పై కేసులు పెడతారని వివరించారు వర్మ. వాళ్ళ ఎండ్ చూస్తా… చాలా సీరియస్ గా ఫైట్ చేయబోతున్నామని ఆగ్రమం వ్యక్తం చేసారు. శేఖర్ రాజుకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, బ్లాక్ మెయిల్ చేసి సెటిల్మెంట్ చేసుకుందం అనే భావన తో శేఖర్ ఇదంతా చేస్తున్నారని వర్మ పేర్కొన్నారు.

Business Headlines: 300 బిలియన్‌ డాలర్లకు చేరనున్న ఇండియా బయో ఎకానమీ!

Exit mobile version