NTV Telugu Site icon

AS : ‘ఏషియన్ సినిమాస్’ లో వాటాకు బాలీవుడ్ సంస్థ ప్రయత్నాలు..?

Asian

Asian

టాలీవుడ్ లో అతి పెద్దదైన సినిమా డిస్ట్రిబ్యూషన్ సంస్థలలో ఏషియన్ సినిమా ముందు వరసలో ఉంటుంది. మరి ముఖ్యంగా నైజాం లో ఏషియన్ సినిమాస్ పేరిట భారీ సినిమా థియేటర్స్ చైన్ ఉంది. హైదరాబాద్ లోని మెజారిటీ స్క్రీన్స్ అన్ని ఏషియన్ సినిమాస్ పేరుతోనే ఉంటాయి. మల్టిప్లెక్స్ లోను ఏషియన్ సినిమాస్ స్క్రీన్స్ కలిగి ఉంది. నారాయణదాస్ కె. నారంగ్ మరియు  ఏషియన్ సునీల్  ప్రపంచ స్థాయి సినిమా వీక్షణ అనుభూతిని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ వెంచర్‌ను ప్రారంభించారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు AMB,అల్లు అర్జున్ AAA మల్టీప్లెక్స్ లో కూడా ఏషియన్ సినిమాస్ వాటా కలిగి ఉంది.

Also Read : SK : ‘అమరన్’ మేజర్ ముకుంద్ కు ఘనమైన నివాళి..

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా  హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, భద్రాచలం, సిద్దిపేట, కరీంనగర్, మంచిర్యాలలో 8 మల్టీప్లెక్స్‌లు, 12 సినీప్లెక్స్‌లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 80 సింగిల్ స్క్రీన్‌లు, మొత్తం 98,000 మంది సీటింగ్‌లు ఉన్నాయి. కాగా ఇప్పుడు ఏషియన్ సినిమాస్ కు భారీ డీల్ వచ్చినట్టు తెలుస్తోంది. ఏషియన్ గ్రూప్ లో కొంత వాటాను తీసుకునేందుకు ఓ బాలీవుడ్ కంపెనీ ప్రయత్నాలు చేస్తోందని ఇటీవల అందుకు సంబంధించి చర్చలు మొదలయ్యాయని సమాచారం. అన్ని అనుకున్నట్టు జరిగి ఈ డీల్ కనుక కుదిరితే భారీ ధరకు ఏషియన్ సినిమాస్ లో కొంత వాటా బాలీవుడ్ కంపెనీ వశమవుతుంది. అలాగే మరిన్ని సింగిల్ స్క్రీన్స్ ను లీజ్ కు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఏషియన్ సినిమాస్ ఇటు థియేటర్స్ మాత్రమే కాకుండా సినిమా డిస్టిబ్యూషన్, ప్రొడక్షన్ లోను ఏషియన్ సినిమాస్ అగ్రగామిగా ఉంది.