NTV Telugu Site icon

ఆర్య, సయేషా సైగల్ దంపతులకు పండంటి బిడ్డ

Arya, Sayesha Saigal, Sayyesha, Sayyesha blessed with baby girl, Vishal,

ప్రముఖ కోలీవుడ్ హీరో ఆర్య భార్య సయేషా సైగల్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సాయేషా సైగల్ కూడా హీరోయిన్. దీంతో ఓ సినిమా సెట్లో కలుసుకున్న ఆర్య, సయేషా ప్రేమలో పడ్డారు. 2019లో మార్చ్ 10న పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. సయేషా వివాహం తరువాత సినిమాలు చేయలేదు. ఆమె ప్రెగ్నెన్సీ విషయం చాలా రహస్యంగా ఉంచారు. పరిశ్రమలో దీని గురించి చాలా మందికి తెలియదు. పైగా కరోనా వల్ల బయటకు కూడా రాకపోవడంతో ఎవరి కంటికీ ఆమె చిక్కలేదు. తాజాగా ఈ వార్తను ఆర్య సన్నిహితుడు, హీరో విశాల్ బయటపెట్టారు.

Read Also : యంగ్ టైగర్ బ్రాండ్ న్యూ కార్… రేటు తెలిస్తే షాక్ !

“ఈ వార్తను బ్రేక్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అంకుల్ గా ఉన్నందుకు చాలా బాగుంది, నా బ్రో జమ్మీ & సయేషా ఆర్ బ్లెస్డ్ విట్ # బేబీగర్ల్. కంట్రోల్ చేసుకోలేని భావోద్వేగాలు ఇప్పుడు షూట్ మధ్యలో ఉన్నాయి” అని విశాల్ ట్వీట్ చేశారు. దీంతో ఆర్య, సయేషా సైగల్ తల్లిదండ్రులు అయ్యారన్న విషయం బయటకు వచ్చింది. ఇక ఆర్య కొత్త చిత్రం “సర్పట్ట పరంపరై” ఇటీవల రిలీజ్ అయ్యి భారీ హిట్‌ గా నిలిచింది. మరోవైపు ఆర్య, విశాల్ ఇద్దరూ కలిసి “ఎనిమీ” అనే చిత్రంలో నటించనున్నారు. కాగా ఆర్య, సయేషాకు నెటిజన్లు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు.