ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల వరుస చిత్రాలు రీ రిలిజ్ అవుతూ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఒకప్పుడు డిజాస్టర్ అయిన చిత్రాలు కూడా తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. దీనికి ‘ఆరెంజ్’ మూవీ ఉదాహరణ. ఇక టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ‘ఆర్య 2’ మూవీ కూడా తాజాగా రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా, నవదీప్ సెకండ్ హీరోగా, శ్రద్దాదాస్ ముఖ్యపాత్రాలో నటించిన ఈ చిత్రం 2009 నవంబర్ 27న రిలీజై బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టింది. ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, ఆదిత్య బాబు నిర్మించిన ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు..
అయితే మొదట ఆర్య మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వగా.. ఆర్య 2 పై అంచనాలు భారీగా ఉండటంతో వాటికి అనుగుణంగా టాప్ స్టార్ కాస్ట్, టెక్నిషియన్స్‌తో సినిమాను రూపొందించారు. అలా ఈ సినిమా కోసం సుమారుగా రూ.25 కోట్ల వరకు ఖర్చు చేశారట. అంతే కాదు ఈ సినిమాను వయాకామ్18 స్టూడియోస్ డిస్ట్రిబ్యూట్ చేసింది. కానీ ఆర్యపై ఉన్న అంచనాలను ఆర్య 2 అందుకోకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించినంత ఫలితాన్ని అందుకోలేకపోయింది. కానీ రీరిలీజ్ లో మాత్రం రికార్డ్ సృష్టించింది. తాజా సమాచారం ప్రకారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఆర్య-2’ ఏకంగా రూ.65 లక్షల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఇలా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సెంటర్‌లో ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన సినిమాల్లో బన్నీ మూవీ సృష్టించిన రికార్డు సరికొత్తది కావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప ఫేమ్ ఎక్కడ తగ్గేది లే అనడాని ఇది మంచి ఎగ్జమ్‌పుల్..