Site icon NTV Telugu

Arjun : 8 ఏళ్ల తర్వాత హీరోగా అర్జున్ సర్జా రీ ఎంట్రీ !

Arjun Sarja

Arjun Sarja

భాషతో సంబంధం లేకుండా మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న సినియర్ హీరో అర్జున్ సర్జా. దాదాపు 1981 నుంచి ఆయన తమిళం, తెలుగు చిత్రాల్లో నటిస్తూనే వస్తున్నారు. 40 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో యాక్టివ్‌గా ఉన్న ఆయన.. ఇప్పటి వరకు దాదాపు 160 చిత్రాల్లో నటించి, ఇందులో 12 చిత్రాలను స్వీయ డైరెక్ట్ చేయడం విశేషం. ఎన్నో అవార్డులను సైతం అందుకున్నారు. అలా 2017 వరకు అర్జున్ సర్జా హీరోగా సినిమాలు చేసి, ఆ తర్వాత నుంచి సపోర్టింగ్ పాత్రల్లో నటిస్తూ వచ్చారు. ఇప్పటికీ చేతి నిండా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే తాజాగా 8 ఏళ్ల తర్వాత అర్జున్ హీరోగా మళ్లీ సినిమా చేయబోతుండటం విశేషం.

Also Read : Roshan: 50 స్క్రిప్ట్స్ రిజెక్ట్ చేసిన శ్రీకాంత్ – రోషన్ టైమ్ వేస్ట్ చేస్తున్నాడా..?

లీడ్ రోల్ లో మళ్లీ అర్జున్ సర్జా నటించేందుకు సిద్ధమయ్యారు. కోలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థ AGS ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో అర్జున్ సర్జా డైరెక్ట్ ఫిల్మ్ రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రానికి కోలీవుడ్ సెన్సేషనల్ స్టార్ ప్రదీప్ రంగనాథన్ అసిస్టెంట్ డైరెక్టర్ దర్శకత్వం వహించబోతుండటం విశేషం. హీరోయిన్ గా అభిరామి, కూతురు పాత్రలో ప్రీతి ముకుందన్ నటిస్తుండటం విశేషం. తండ్రి కూతురు చుట్టూ తిరిగే కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని కోలీవుడ్ మీడియా వెల్లడించింది.

Exit mobile version