విజయరామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. ఈ రోజు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హను రాఘవపూడి సినిమా టీజర్ ని లాంచ్ చేశారు. ఓ కబడ్డీ ఆటగాడి నిజ జీవితాన్ని ఆధారంగా తీసుకొని రూపొందిన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను కట్టిపడేసింది. సినిమాని బిగ్ స్క్రీన్‌పై చూడాలనే క్యురియాసిటీని టీజర్ మరింతగా పెంచింది. టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో విజయరామరాజు మాట్లాడుతూ టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా ఉందని చెబుతున్నారు. ఇది చాలా ఆనందాన్నిచ్చింది. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ చాలా అద్భుతమైన వర్క్ చేశారు. మ్యూజిక్. విజువల్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. హీరోయిన్ సిజ్జా ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసింది.
Also Read:MLC Nagababu: నాకు పదవుల మీద ఆశ లేదు.. కానీ..!
ఈ సినిమాతో తనకు మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. అజయ్ , దయ , అజయ్ ఘోష్ వీళ్లంతా కూడా మా సినిమాకి ప్లస్ అయ్యారు. మా నిర్మాత శ్రీని ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని అద్భుతంగా రూపొందించారు. నేను ఏడాదిన్నర పాటు ప్రో కబడ్డీ టీమ్స్ తో ట్రావెల్ అయ్యి రియల్ గా గేమ్ నేర్చుకుని ఈ సినిమా చేయడం జరిగింది. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం సిక్స్ ప్యాక్ చేయాల్సి వచ్చింది. ఇవంతా మా డైరెక్టర్ మా నిర్మాత సపోర్ట్ తోనే సాధ్యమైయింది. మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా నిర్మాతకి ధన్యవాదాలు. నా జీవితంలో గుర్తుండిపోయే సినిమా ఇది. ఇంత మచి క్యారెక్టర్ ఉన్న సినిమా రావడం చాలా అరుదు. మా డైరెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ సినిమాలో నేను ఏదైనా పర్ఫామెన్స్ చేశానంటే అది మా డైరెక్టర్ గారి వల్లే. ఆయన అద్భుతంగా మలుచుకున్నారు. చాలా డెడికేటెడ్ డెడికేషన్ తో ఈ సినిమా తీశారు. నిరంతరం సినిమా కోసమే తపించారు. ఈ సినిమా క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుంది. చాలా మంచి సినిమాది. చాలా కష్టపడి చేశాం. మీరందరూ సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్తారని మనస్పూర్తిగాకోరుకుంటున్నాను అందరికీ థాంక్యు’ అన్నారు.
