తాజాగా శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రలో నటించిన ‘అరి’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి డీసెంట్ రివ్యూస్ కూడా వచ్చాయి. అయితే, తాజాగా మహాత్మా గాంధీని ఉద్దేశిస్తూ శ్రీకాంత్ అయ్యంగార్ చేసిన వ్యాఖ్యల గురించి కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసింది. ఈ నేపద్యంలోనే శ్రీకాంత్ అయ్యంగార్ నటించిన ‘అరి’ సినిమా పోస్టర్లను థియేటర్లలో నుంచి కొంతమంది గాంధీ అభిమానులు తొలగిస్తున్నారు.
Also Read:Karwa Chauth: మాకు పెళ్లిళ్లు కావడం లేదు, నీకు ఇద్దరు భార్యలు ఎలా బ్రో.? కార్వా చౌత్ వేడుకలు వైరల్..
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాకి హిట్ టాక్ రావడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సినిమా దర్శకుడు జయశంకర్‌ను పిలిచి అభినందించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు సినిమా టీమ్ ఒక ఫోటో రిలీజ్ చేసింది. ఒకపక్క సినిమా పోస్టర్లను గాంధీ అభిమానులు తొలగిస్తుంటే, మరో పక్క కేంద్ర మంత్రి అభినందిస్తూ ఉండడం ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
