Site icon NTV Telugu

Arabia Kadali: సస్పెన్స్ థ్రిల్లర్‌ మూవీ ‘అరేబియా కడలి’ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

Arebiya Kadali

Arebiya Kadali

ప్రేక్షకులను ఉత్కంటంలో ముంచెత్తే సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘అరేబియా కడలి’ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. ప్రముఖ నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌కు సూర్యకుమార్ దర్శకత్వం వహించారు. దీనిలో ప్రత్యేకత ఏంటంటే, ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కథ రచయితగా, క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించగా. ఈ సిరీస్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేపింది. అయితే తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సిరీస్‌కి సంబంధించిన స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది.

Also Read : Shruti Hassan : అదే నా డ్రీమ్ రోల్..

కాగా ఈ సిరీస్ ఆగస్టు 8న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఈ నేపథ్యంలో విడుదల చేసిన పోస్టర్‌లో “కాలానికి అందరూ సమానమే.. ఒడిదుడుకులు ఎవరినీ వదలవు” అనే ట్యాగ్‌లైన్ ఆసక్తికరంగా ఉంది. కథలో ప్రధానాంశం ఏమంటే.. రెండు గ్రామాలకు చెందిన మత్స్యకారులు పొరపాటున బార్డర్ క్రాస్ చేసి విదేశీ జైళ్లలో చిక్కుకుంటారు. అక్కడి నుంచి వారు ఎలా బయటపడ్డారు? ఏం జరిగింది? అనేదే ఈ సిరీస్ కథాంశం. 2024లో ఈ సిరీస్‌ చిత్రీకరణ మొదలైంది. ఇదే నేపథ్యంలో కొన్ని సినిమాలు ఇప్పటికే వచ్చిన, ఈ కథ పూర్తిగా ఒరిజినల్ అని మేకర్స్ స్పష్టం చేశారు. సత్యదేవ్ సరసన ఆనంది నటించగా, ఇతర కీలక పాత్రల్లో టాలెంటెడ్ నటులు న‌టించారు. మరి ఈ థ్రిల్లింగ్ అంశాలతో, హ్యూమన్ ఎమోషన్స్‌తో, యథార్థ సంఘటనల టచ్‌తో రూపొందిన ‘అరేబియా కడలి’, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూద్దాం!

 

Exit mobile version