స్టార్ తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్, తెలుగు, హిందీ భాషల్లోనూ హిట్స్ ఇచ్చినప్పటికీ, ఇటీవల హిందీ సినిమాలపై తాను ఎదుర్కొంటున్న సమస్యలను ఓ ఇంటర్వ్యూలో ఓపిగ్గా వివరించారు. ప్రస్తుతం శివ కార్తికేయన్ హీరోగా రూపొందుతున్న ‘మదరాసి’ సినిమా ప్రచారంలో భాగంగా, హిందీలో సినిమాలు తెరకెక్కించే విషయం పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Also Read : Param Sundari : జాన్వీ కపూర్ ‘పరమ్ సుందరి’ రిలీజ్ డేట్ ఫిక్స్..
మురుగదాస్ మాట్లాడుతూ..‘నా మాతృభాష తమిళ్‌లో ప్రాజెక్టులు చేయడం నాకు సులువు. అక్కడి ప్రేక్షకులకు ఏం నచ్చుతుందో తెలుస్తుంది. కానీ హిందీలో నాకు స్క్రిప్ట్ అనువదించాలి. అది ఆంగ్లం నుంచి హిందీకి మారుతుంది. ఈ సమయంలో నా అసలు ఆలోచన పై స్పష్టత కోల్పోతుంటాను. డైలాగులు, ఎమోషన్లు మారిపోతాయి. అందుకే హిందీ చిత్రాల్లో పని చేస్తున్నప్పుడు నేను దివ్యాంగుడినైనట్టు అనిపించింది’ అని అన్నారు.
కానీ మురుగదాస్ తెలుగు భాషలో మాత్రం కొంత అవగాహన ఉన్నట్లు తెలిపారు. అలాగే, ‘తమిళం లేదా తెలుగులో నేను యువతకు ఏం నచ్చుతుందో, సోషల్ మీడియాలో ఎలా కనెక్ట్ కావాలో తెలుసుకుని ముందుకు పోతా. కానీ హిందీ నేటివ్ కాని, అక్కడి సంస్కృతి, భాషా నడక పూర్తిగా అర్థం కాలేదు. అందుకే అక్కడ నేను అసలు ఫ్రీగా పని చేయలేక పోయాను’ అని అంగీకరించారు. ఇక ఆయన తెరకెక్కిస్తున్న ‘మదరాసి’ సినిమాను సెప్టెంబర్ 5న విడుదల చేయనున్నారు. రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి సంగీతం అనిరుధ్ అందిస్తున్నారు. మురుగదాస్ ఈ సినిమా ద్వారా తన మార్క్‌ను తిరిగి నిరూపించుకోవాలని భావిస్తున్నారు.
