ఏఆర్ మురుగదాస్ పాన్ ఇండియా మూవీ “1947”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తాజాగా పాన్ ఇండియా మూవీని చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రానికి ‘1947’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఓం ప్రకాష్ భట్, మురుగదాస్ కలిసి సంయుక్తంగా ఈ పాన్ ఇండియా మూవీని నిర్మించనున్నారు. ‘1947’ మూవీకి తమిళ డైరెక్టర్ పోన్ కుమారన్ దర్శకత్వం వహించనున్నారు. తమిళ, కన్నడ చిత్రాలను తెరకెక్కించే కుమారన్ కన్నడ బ్లాక్ బస్టర్ ‘విష్ణువర్ధన’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా చిత్రం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ‘1947’ చిత్రం ఏ నేపథ్యంలో రూపొందనుందో తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. కాగా దర్శకుడు మురుగదాస్ ఇంతకుముందు రాజా రాణి వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. కాగా తలపతి విజయ్ కోసం మురుగదాస్ ప్రస్తుతం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. తమిళంలో విజయ్, మురుగదాస్ సూపర్ హిట్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.
Also Read
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్‌తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!