ఇండస్ట్రీలో నటి కావడం అంటే కేవలం నటన మాత్రమే కాక, వ్యక్తిగత జీవితం, శరీర రూపం మీద వచ్చే విమర్శలను కూడా ఎదుర్కోవడం. ఇలాంటి అవమానాలు హీరో హీరోయిన్ లు అంత కూడా ఎదురుకుని ఉంటారు. ఎక్కువగా హీరోయిన్‌లకు ఇలాంటి అంమానాలు ఎదురవుతాయి. అయితే తాజాగా ఈ విషయంపై మలయాళ నటి అపర్ణ బాలమురళి స్పందించారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..
Also Read : Thaman : అనిరుద్ కావాలి అన్నవారికి థమన్ ఇచ్చిన సాలిడ్ రిప్లై !
అపర్ణ మాట్లాడుతూ.. ‘సన్నగా ఉన్నప్పుడు “ఇంత సన్నగా ఉన్నావేంటి?”, లావుగా ఉన్నప్పుడు “ఇంత లావుగా అయితే ఎలా?” అనే విమర్శలను తరచుగా ఎదుర్కొన్న. ఈ విమర్శలను మొదటికి బాధగా అనిపించాయి. ఓసారి విమాన ప్రయాణం తర్వాత ఎయిర్‌పోర్టులో ఒక వ్యక్తి తన దగ్గరికి వచ్చి “మీ రూపం ఇలా మారిపోయిందా?” అని అడిగాడు. అప్పటికి ఆశ్చర్యానికి గురై, కానీ తర్వాత అర్ధమైందని, “అతను నా శరీరం గురించి మాత్రమే మాట్లాడుతున్నాడ” అని గుర్తించి బాధగా అనిపించింది. అయితే, కెరీర్ ఆరంభంలో ఇలాంటి కామెంట్లు చూసి బాధ పడినా, కాలక్రమేణా వాటిని పని భాగంగా భావించడం అలవాటు అయింది. అప్పటికి దృఢంగా ఉండటానికి, సానుకూలంగా స్పందించడానికి చాలా సమయం పట్టింది’ అని తెలిపింది.
ప్రస్తుతం అపర్ణ బాలమురళి ఎక్కువగా మలయాళ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నారు. గతంలో ఆకాశం నీ హద్దురా వంటి తమిళ అనువాద చిత్రాల్లో నటించారు. అయితే ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా యాక్టివ్‌గా కనిపించలేరని, ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా విడుదల కాలేదని ఆమె తెలిపారు. అపర్ణ ఇచ్చిన వ్యాఖ్యలు, నటి ఫిట్నెస్, ప్రైవసీ, శరీర స్వీకారం విషయంలో స్పష్టమైన మెసేజ్‌ను అందిస్తున్నాయి. బాడీ షేమింగ్‌కు తగ్గట్లుగా స్పందించడంలో ధైర్యాన్ని చూపడం ఆమె సోషల్ మీడియా ఫ్యాన్స్‌కు కూడా స్ఫూర్తిగా నిలుస్తుంది.