Site icon NTV Telugu

Dhanush: బిచ్చగాడిగా అపర కుబేరుడు..మ్యాటర్ ఏంటంటే..?

Untitled Design (8)

Untitled Design (8)

, సూపర్ స్టార్ ధనుష్ సార్ చిత్రంతో స్ట్రయిట్ తెలుగు సినిమాలో నటించి సూపర్ హిట్ సాధించాడు. ఆ సినిమా ఇచ్చిన ఉత్సహంతో తెలుగులో మరో సినిమా స్టార్ట్ చేసాడు ధనుష్. జాతీయ అవార్డు-విజేత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు ఈ స్టార్ హీరో. కింగ్ నాగార్జున క్రేజీ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ పాన్ఇండియా చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మల్టీస్టారర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘కుబేర’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు మేకర్స్.

ఈరోజు ధనుష్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల చిత్ర హీరో ధనుష్ లుక్ ను విడుదల చేస్తూ ఓ పోస్టర్‌ ను విడుదల చేశారు. ఆ పోస్టర్ లో ధనుష్ మాసిన గడ్డంతో బిచ్చగాడి లుక్ లో బలహీనత మరియు వినయం రెండింటినీ అతని సిన్సియర్ మరియు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ధనుష్‌ ప్రామాణికమైన నటనను పోస్టర్ లో స్పష్టంగా ప్రదర్శించాడు.

శేఖర్ కమ్ముల అంటే కచ్చితంగా బలమైన కథ, కథనం ఉంటాయి. ధనుష్ కెరీర్ లో తొలిసారి బిచ్చగాడి పాత్రలో నటిస్తున్నాడు. కమ్ముల టేకింగ్ కు ధనుష్ నటన తోడైతే ప్రేక్షకులకు విజువల్ ట్రేట్ అనే చెప్పాలి. ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా, జిమ్ సర్భ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరెకెక్కనున్న ఈ చిత్రాన్ని ఆసియాన్ సినిమాస్ బ్యానర్ పై ఏషియన్ సునీల్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా భాషలలో రానున్న ఈ ఏడాదిలో థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.

Also Read: Vishwak: మెకానికి రాకి ఫస్ట్ గేర్.. ట్రైలర్ టాక్..

Exit mobile version