నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా తెరకెక్కిన తండేల్ సినిమా యూనిట్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో ఆ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ లలో ఒక్కొక్క టికెట్ మీద 50 రూపాయలు, మల్టీప్లెక్స్ లలో ఒక్కొక్క టికెట్ పైన 75 రూపాయలు పెంచుకునే సౌలభ్యం కలిగించింది. ఇక సినిమా రిలీజ్ అయిన వారం రోజులు వరకు ఈ రేట్లు పెంచి అమ్ముకునే సౌలభ్యాన్ని కల్పించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొంతమంది మత్స్యకారులు చేపల వేట కోసం గుజరాత్ తీయడానికి వెళ్లి అక్కడ అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లోకి ఎంటర్ అయ్యారు. వెంటనే వారిని పాకిస్తాన్ నేవీ అదుపులోకి తీసుకుని జైల్లో పెట్టింది.
Balakrishna : “బాలయ్య బాబు = ఎమోషనల్”.. లోకేష్ చెప్పిన కొత్త భాష్యం
సుమారు 16 నెలల జైలు జీవితం గడిపిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకోవడంతో పాకిస్తాన్ జైలు నుంచి శ్రీకాకుళం మత్స్యకారుల బృందం విడుదలైంది.. వారిలో కొన్ని కథలను ఆధారంగా చేసుకుని ఒక సినిమా కథగా రూపొందించారు అదే ప్రాంతానికి చెందిన కార్తిక్ అనే యువకుడు. కార్తీక్ అందించిన కథకు చందు మొండేటి తనదైన స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. నాగచైతన్య కెరియర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో తెరకెక్కబోతున్న ఈ చిత్రం మీద అనౌన్స్ చేసిన నాటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి.