Site icon NTV Telugu

Movie Ticket Prices: సినిమా టికెట్ల ధ‌ర‌ల ఖ‌రారుపై ఏపీ సర్కార్‌ కమిటీ..

Movie Ticket Prices

Movie Ticket Prices

Movie Ticket Prices: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలో సినిమా టికెట్ల ధ‌ర‌ల ఖ‌రారుపై ఓ క‌మిటీ ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం… హోంశాఖ ముఖ్య కార్యద‌ర్శి నేతృత్వంలో నలుగురు స‌భ్యుల‌తో ఈ క‌మిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో స‌మాచార శాఖ కార్యద‌ర్శి, ఆర్ధిక శాఖ కార్యద‌ర్శి, న్యాయ శాఖ కార్యద‌ర్శి, సినీ నిర్మాత వివేక్ కుచిభ‌ట్ల సభ్యులుగా ఉంటారు. సినిమా టికెట్ ధ‌ర‌లు పెంచాల‌ని గ‌తంలో హైకోర్టులో పిటీష‌న్ దాఖలు అయ్యింది.. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల‌తో క‌మిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వుల జారీ చేశారు హోం శాఖ ముఖ్య కార్యద‌ర్శి కుమార్ విశ్వజిత్..

Read Also: CM Revanth Reddy : కాళేశ్వర త్రివేణి సంగమంలో రేపు సీఎం రేవంత్‌ రెడ్డి పుణ్యస్నానం

కాగా, గత వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి సినిమా టికెట్ల వ్యవహారంపై రచ్చ జరుగుతూ వచ్చింది.. కొన్ని సినిమాలకు టికెట్ల ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం.. మరికొన్ని సినిమాలకు ఇవ్వకపోవడంపై కూడా చర్చ సాగింది.. ఇక, సినిమా టికెట్ ధ‌ర‌లు పెంచాల‌ని గ‌తంలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు అయ్యింది.. ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపు విషయంలో అనేక వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి.. ప్రస్తుతం కొత్త సినిమా అయితే చాలు భారీగా పెరుగుతున్నాయి సినిమా టికెట్ల ధరలు. ఈ నేపథ్యంలో ఏపీలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం.. సినిమా టికెట్ల ధరలను ఖరారు చేయడంపై దృష్టి సారించింది.. అందులో భాగంగా కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. సినిమా టికెట్ల ధరలు, థియేటర్ల వర్గీకరణ లాంటి తదితర అంశాలను ఈ కమిటీ పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది.. ఆ తర్వాత ఆ సినియా థియేటర్ల కేటగిరీని పట్టి.. సినిమా టికెట్ల ధరలను ప్రభుత్వం ఖరారు చేసే అవకాశం ఉందంటున్నారు..

Exit mobile version