NTV Telugu Site icon

Anupama : గ్లామర్ డోర్లు తెరిచిన అనుపమకి ఆఫర్లే ఆఫర్లు

Anupama

Anupama

అనుపమ కెరీర్ గురించి మాట్లాడుకోవాలంటే టిల్లు స్క్వేర్ కు ముందు.. తర్వాత అని చెప్పొచ్చు. కళ్లతోనే హావభావాలు పలికించే ఈ మలయాళ కుట్టీ.. ఎక్కువగా హోమ్లీ లుక్కులోనే ఆకట్టుకుంది. కానీ స్టార్ డమ్ దక్కించుకోవడంలో ఫెయిలయ్యిలంది. గ్లామర్ షోకు నో చెప్పడంతో స్టార్ హీరోలు కూడా దూరం పెట్టేశారు. దీంతో స్టైల్ మార్చింది. టిల్లు స్క్వేర్ తో గ్లామర్ డోర్స్ ఓపెన్ చేసింది. టిల్లు స్క్వేర్ హిట్టు ఆమె కెరీర్‌ ఫుల్ స్వింగులోకి వచ్చింది. గ్లామర్ డోస్ పెంచినందుకు వరుస పెట్టి ఆఫర్లను కొల్లగొడుతుంది. ప్రెజెంట్ అమ్మడి చేతిలో ఆరు ప్రాజెక్టులు ఉన్నాయి.

Pattudala: అజిత్ ‘పట్టుదల’ ట్రైల‌ర్ అదిరింది.. చూశారా?

మూడు ఇండస్ట్రీలను చుట్టేస్తుంది ఈ కేరళ కుట్టీ. మలయాళంలో రెండు, తమిళంలో మూడు, తెలుగులో ఓ ప్రాజెక్టులో వర్క్ చేస్తోంది అనుపమ.యంగ్ హీరోలతో పాటు లేడీ ఓరియెంట్ చిత్రాలను లైన్లో పెడుతుంది. తెలుగులో పరదాతో పాటు, తమిళంలో లాక్ డౌన్ లాంటి ఉమెన్ సెంట్రిక్ మూవీస్ చేస్తోంది. పరదాకు యంగ్ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.యంగ్ హీరోలు ధ్రువ్ విక్రమ్‌తో బిసోన్, ప్రదీప్ రంగనాథ్ తో డ్రాగన్ తో పాటు జీఎస్కే ట్రూత్ షాల్ అల్వేస్ ప్రీవేల్, పెట్ డిటెక్టివ్ లాంటి సినిమాలు చేస్తుంది. ఈ ఆఫర్ల జోరు చూసి టైర్ వన్ హీరోలు ఆమెకు ఛాన్సులిస్తారేమో చూడాలి…