Site icon NTV Telugu

Anupama : అనుపమని పక్కన్న పెడుతున్న టాలీవుడ్..

Anupama Parameshwaran

Anupama Parameshwaran

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో చెప్పకర్లేదు. ముఖ్యంగా కుర్రాళ్ల హృదయాలను దోచేసిన ఈ ముద్దుగుమ్మ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అయితే తెలుగులో మొదట వరుస అవకాశాలు అందుకున్నప్పటి తర్వాత అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో బొద్దుగా ఉంటే ఛాన్స్‌లు రావట్లేదని సన్నగా మారింది. కానీ అనుపమ లోని ఈ మేకోవర్స్ కొంతమంది ఫ్యాన్స్‌కి నచ్చినా,ఇం కొంతమందికి మాత్రం రుచించలేదు.

Also Read: Balakrishna : ‘అఖండ 2’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

చివరగా తెలుగులో ఈగల్, టిల్లు స్క్వేర్ సినిమాలు చేసింది. ఇందులో ‘టిల్లు స్క్వేర్’ సూపర్ హిట్ పడినా కూడా అమ్మడికి తర్వాత పెద్దగా ఛాన్స్‌లు రాలేదు. దీంతో  ఇతర భాషలో మాత్రం బిజీగా గడుపుతోంది.. ప్రస్తుతం ‘పరదా’ సినిమా చేస్తుంది. ఆ సినిమా టీజర్‌తో ఆడియన్స్ లో ఆసక్తి కలిగేలా చేశారు. ఇక మరోపక్క కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ తో ‘బిసన్’ అనే సినిమా చేస్తుంది. అలాగే ‘లాక్ డౌన్’ అనే సినిమా కూడా చేస్తుంది అనుపమ. మలయాళంలో ‘పెట్ డిటెక్టివ్’ మూవీ, దీంతో పాటు జె.ఎస్.కె ట్రూత్ షల్ ఆల్వేస్ అనే సినిమా చేస్తుంది. ఇలా తమిళ, మలయాళ భాషల్లో పర్వాలేదు కానీ తెలుగులో మాత్రం అనుపమను పట్టించుకోవట్లేదు. రీసెంట్‌గా ‘డ్రాగన్’ సినిమాతో తమిళంతో పాటు తెలుగులో కూడా సక్సెస్ అందుకుంది. కానీ ఎంత ట్రై చేసిన టాలీవుడ్‌లో మాత్రం అమ్మడికి ఛాన్స్ లు రాకపోవడానికి కారణం ఏంటన్నది తెలియట్లేదు. తెలుగులో వరుస ప్రాజెక్ట్ లు అనౌన్స్ మెంట్ అవుతున్నప్పటికి ఏ ఒక్క మూవీలో కూడా అనుపను తీసుకోవడం లేదు. దీంతో తెలుగు ఆడియన్స్ కొంత డిసప్పాయింట్ అవుతున్నారు.

Exit mobile version