Anupama: బ్యాడ్ డేస్ ని అసలు మాటల్లో చెప్పలేను!

Insta Anupama

Insta Anupama

తన బ్రేకప్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వేళ అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతూ హాట్ టాపిక్ అయ్యారు. ఇక తాజాగా ఆమె నటించిన క్రేజీ కళ్యాణం టీజర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న ఆమె పరదా రిజల్ట్ మీద, తన బాడ్ ఫేజ్ మీద కామెంట్స్ చేశారు.’పరదా’ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకొని చాలా బాగా యాక్ట్ చేశారు. కానీ థియేట్రికల్ పరంగా సరైన అప్లాజ్ రాలేదు. ఒక రకంగా అది బ్యాక్ స్టెప్ వేసేలాంటి మూమెంట్ అది. ఇంత కష్టపడితే ఎందుకు రిజల్ట్ రాలేదు అన్న ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఒక దశలో లేడీ ఓరియంటెడ్ సినిమాలకి జనం రారేమో అన్న ఒక క్వశ్చన్ మార్క్ కూడా రైజ్ అయింది. అలాంటి టైంలో ఈ మధ్యకాలంలో ‘మా ఇంటి బంగారం’ లాంటి సినిమా మళ్ళీ రావడం ఒక కొత్త హోప్ తీసుకొచ్చింది లేడీ ఓరియంటెడ్ సినిమాల మీద. దీని మీద మీ అనాలసిస్ ఏంటి? ఇకమీదట రాబోయే లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎలా ఉండబోతున్నాయి? మీరు ఏ కోణంలో దాన్ని చూడబోతున్నారు? ‘పరదా’ నుంచి మీరు బయటపడడానికి మీరు తీసుకున్న టైం ఎంత? అని అడిగితే ఆమె స్పందిస్తూ “సౌండ్ లెస్ గా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఆన్ యాక్టర్ నాకు ఏంటంటే ఒక సినిమా గురించి ఐ డిస్కనెక్ట్ ఫ్రమ్ మై సినిమా ఆన్ ది డే ఆఫ్ ది రిలీజ్. రిలీజ్ దాకే.. ఇమ్మీడియట్లీ ఐ డిస్కనెక్ట్.

ఇప్పుడు ఒక పెద్ద 200 క్రోర్స్, 100 క్రోర్స్ ఫిల్మ్స్ ఉన్నాయి, నాకు అది.. నేను ఎక్కువ సెలబ్రేట్ చేయను, అది ఆ రోజు దాకే, అప్పటి నుంచి నెక్స్ట్ ఫిల్మ్‌కి వర్క్ చేయాలి. అండ్ అది.. ఇప్పుడు ‘పరదా’ ఫర్ యాన్ ఎగ్జాంపుల్ ఇట్ వాస్ డిఫికల్ట్ అండి. నాకు చాలా ఫిల్మ్స్ డిజాస్టర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కానీ ‘పరదా’ మీద చాలా హోప్స్ ఉండింది. అండ్ అది అలా వర్క్ అవ్వలేదని మామూలుగా నేను తీసుకునే టైం కన్నా కొంచెం ఎక్కువ, మే బి వన్ టూ డేస్ నేను దాని గురించి బాధపడ్డాను. లోపల భయం అయితే కచ్చితంగా ఉంటది, ఫీమేల్ సెంట్రిక్ సబ్జెక్ట్స్ విన్నప్పుడు ‘అమ్మా, ఇది మళ్ళీ ఫీమేల్ సెంట్రిక్, ఇది వర్క్ అవుతుందా లేదా?’ అన్న భయం ఉంటది. కానీ మనకి ఎప్పుడైనా ఒక భయం ఉన్నప్పుడు, మనం తీసుకునే డిసిషన్సే సం టైమ్స్ మన లైఫ్ ని అప్ సైడ్ డౌన్ ఇట్ విల్ చేంజ్ యూ. సో ఐ బిలీవ్ ఇన్ దట్. సో ఆ భయం ఈజ్ ఎ సిగ్నల్ దట్ వరల్డ్ ఈజ్ చాలెంజింగ్ యు. మే బి దిస్ చాలెంజ్ కెన్ వర్క్. సో ఐ వంట్ గివ్ అప్ ఆన్ ఇట్ అండ్ ఐ డోంట్ వాంట్ ఎనీవన్ టు గివ్ అప్ ఆన్ ఇట్.” “ఒక బ్యాడ్ పీరియడ్ ని, ఒక బ్యాడ్ స్టేజ్ ని దాటుకొని వచ్చాను” అన్నారు కదా, అది మిమ్మల్ని.. కొత్త అనుపమగా మారడానికి అవి ఎంతవరకు హెల్ప్ చేశాయి? అని అడిగితే దానికి ఆమె స్పందిస్తూ దాటి వచ్చిన బ్యాడ్ డేస్ ని అసలు మాటల్లో చెప్పలేను. మీరు నా లైఫ్ చూసి మీరు అర్థం చేసుకుంటారు కచ్చితంగా అని చెప్పుకొచ్చారు.