Site icon NTV Telugu

Anupama : మళ్ళీ అదే హీరోతో జతకడుతున్న అనుపమ

Anupama

Anupama

యూత్‌ ల్లో తిరుగులేని ఫ్యాన్ బేస్ సంపాదిచుకున్న హీరోయిన్ మలయాళ కుట్టి అనుప‌మ ప‌ర‌మేశ్వర‌న్‌. సోషల్ మీడియాలో ఈ అమ్మడికి ఫాలోయింగ్ మాములుగా ఉండదు. ఎలాంటి పోస్ట్ పెట్టిన నిమిషాల్లో వైరల్ అవుతుంది.  ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన ఈ కేరళ కుట్టి.. ఇటివల కాలంలో అడపాతడపా సినిమాల్లో చేస్తుంది. చివరిగా సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘టిల్లు స్క్వేర్’ సినిమాలో, గ్లామర్ బ్యూటీ‌గా షాక్ ఇచ్చిన అనుపమ, రీసెంట్‌గా ‘రిటర్న్‌ ఆఫ్‌ది డ్రాగన్‌’లో అద్భుతమైన పాత్రలో కనిపించి ఓరేంజ్‌లో ఆకట్టుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ తెలుగు చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

Also Read : Kalyan Ram : ఆమెను నేను అమ్మ అనే పిలుస్తా

సంప‌త్ నంది ద‌ర్శకత్వంలో శ‌ర్వానంద్ – అనుప‌మ కాంబోలో ప్రాజెక్ట్ ఓకే అయిందట. ఈ ఏప్రిల్ నుంచి సినిమా మొద‌లుకాబోతున్నట్లు సమాచారం.  పూర్తి వివ‌రాలు త్వర‌లో రానున్నాయి. ‘శ‌త‌మానం భ‌వ‌తి’ మూవీ కోసం తొలిసారి జోడీ క‌ట్టిన శ‌ర్వానంద్ – అనుప‌మ ప‌ర‌మేశ్వర‌న్‌ ఇన్నాళ్లకు మ‌ళ్లీ వీరిద్దరూ కల‌సి న‌టించ‌బోతున్నారు. అయితే ప్రస్తుతం శ‌ర్వానంద్ చేతిలో రెండు సినిమాలున్నాయి. ‘నారీ నారీ న‌డుమ మురారి’ తో పాటు, అభిలాష్ అనే కొత్త ద‌ర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాల షూటింగులూ స‌మాంత‌రంగా జ‌రుగుతున్నాయి. ‘నారీ.. నారీ’ దాదాపుగా పూర్తి కావొచ్చిందట, అందుకే సంప‌త్ నంది సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట శర్వా. అలాగే దర్శకుడు సంప‌త్ నంది తన ‘ఓదెల 2’ చిత్రాన్ని కూడా పూర్తి చేశారు. ఇక శ‌ర్వానంద్ – అనుప‌మ మూవీ గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Exit mobile version