Site icon NTV Telugu

Ante Sundaraniki : అంటే.. సుందరానికీ ట్విట్టర్‌ రివ్యూ..!

Ante Sundaraniki

Ante Sundaraniki

న్యాచురల్‌ స్టార్‌ నాని హీరోగా మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్‌ హీరోయిన్‌గా తెరకెక్కిన సినిమా ‘అంటే.. సుందరానికీ’. ఈ సినిమాకు ‘మెంటల్‌ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’లాంటి చిత్రాలతో చక్కటి గుర్తింపు తెచ్చుకున్న వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించారు. ప్యూర్‌ కామెడీ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో నాని ఓ అమాయకపు బ్రాహ్మణ కుర్రాడిగా, నజ్రియా క్రిస్టియన్‌ అమ్మాయిగా నటించింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. బ్రాహ్మణ కుర్రాడు, క్రిస్టియన్ అమ్మాయిల మధ్య ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఈ సినిమా విడుదలైంది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ‘అంటే సుందరానికీ’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్‌ వేదికగా చర్చిస్తున్నారు.

 

‘అంటే సుందరానికీ’లో కామెడీ, ఎమోషనల్‌ రెండూ వర్కౌట్‌ అయ్యాయి. ఒక్కోసారి లెంగ్తీగా అనిపించినా, రొటీన్‌ కామెడీ సీన్స్‌ ఉన్నప్పటికీ సినిమా ఎంగేజింగ్‌గా ఉంటుంది. భావోద్వేగాలు బాగా పనిచేశాయి. నాని, నజ్రియా, మిగతా నటీనటులు పర్ఫెక్ట్‌గా నటించారు. ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు. అలాగే.. ఫస్టాఫ్‌ బాగుంది. సెకండాఫ్‌ చాలా బాగుంది. వివేక్‌ ఆత్రేయకు మరో విజయం దక్కింది. నాని, నజ్రియా, హర్షవర్థన్‌, నరేశ్‌ల యాక్టింగ్‌ బాగుంది అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ఇలా ప్రేక్షకులకు కామెంట్లు చూస్తుంటే.. మరో హిట్‌ నాని ఖాతాలో చేరినట్లే కనిపిస్తోంది.

 

 

Exit mobile version