మన్మధుడు, రాఘవేంద్ర లాంటి సినిమాలలో నటించిన అన్షు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ సినిమాల తర్వాత ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చి యూకే వెళ్ళిపోయింది. అక్కడే చదువుకుని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. మన్మధుడు రీ రిలీజ్ తర్వాత ఒక్కసారిగా ఆమె మళ్ళీ ఫిలింనగర్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆమె కేవలం ఈ క్రేజ్ ఎంజాయ్ చేయడానికి వచ్చింది అనుకుంటే అనుకోకుండా ఆమెకు మజాకా సినిమాలో నటించే అవకాశం దొరికి, ఆ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆ సినిమా శివరాత్రి సందర్భంగా 26వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతుంది.
Thandel : తండేల్ డే 1.. దుల్లకొట్టేసిన నాగ చైతన్య
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అన్షు తన ఇంటిపేరు గురించి స్పందించింది. నిజానికి అన్షు గురించి గూగుల్ లో సెర్చ్ చేస్తే ఆమె పేరు అన్షు అంబానీ అని చూపిస్తుంది. అయితే నిజంగా ఆమె అంబానీ కుటుంబానికి చెందిన వ్యక్తి ఏనా అనే ప్రశ్న ఎదురైతే దానికి ఆమె స్పందించింది. తాను అంబానీ కుటుంబానికి చెందిన వ్యక్తిని కాదని ఆమె క్లారిటీ ఇచ్చింది. ఎప్పుడో 2002లో ఒక రిపోర్టర్ చేసిన పని వల్ల ఇప్పటికీ వికీపీడియాలో తన పేరు అలాగే ఉండిపోయిందని ఆ పేరు మార్చడానికి తనకి సహాయం చేయాలంటూ ఎదురు హెల్ప్ అడిగింది. ఇక తన భర్త పేరు సచిన్ అని పేర్కొన్న ఆమె ఆయన ఇంటి పేరు సాగర్ అని చెప్పుకొచ్చింది. ఇక తన సొంత ఇంటి పేరు చాలా పొడుగ్గా ఉండటం వల్ల తాను అన్షు అని మాత్రమే తొలి రెండు చిత్రాలకు స్క్రీన్ నేమ్ గా ఇచ్చానని ఆమె వెల్లడించారు.