Site icon NTV Telugu

అల్లరి నరేష్ “సభకు నమస్కారం”లో మరో యంగ్ హీరో

Naresh58 titled as Sabhaku Namaskaram

చాలాకాలం తరువాత “నాంది”తో మంచి విజయాన్ని అందుకున్న అల్లరి నరేష్ ప్రస్తుతం సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఇక నుండి కంటెంట్ ఉన్న చిత్రాలలో మాత్రమే నటించాలని చూస్తున్నాడు. ఇటీవల అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నెక్స్ట్ మూవీని ప్రకటించారు. “సభకు నమస్కారం” పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా అల్లరి నరేష్ కెరీర్లో 58వ చిత్రం. ఈ సెటైరికల్ పొలిటికల్ థ్రిల్లర్ కు దర్శకుడు సతీష్ మల్లంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ ఎస్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాను ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్లో అల్లరి నరేష్ లుక్ విభిన్నంగా ఉండడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది.

Read Also : “ఆర్ఆర్ఆర్”లో రామ్ చరణ్ సర్పైజ్ లుక్

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ బయటకు వచ్చింది. ఇందులో అల్లరి నరేష్ తో పాటు మరో యంగ్ హీరో కూడా నటించబోతున్నాడట. సమాచారం ప్రకారం “అరవింద సమేత”లో చక్కని నటనను కనబర్చిన ప్రతిభావంతుడైన యువ నటుడు నవీన్ చంద్ర “సభకు నమస్కారం”లో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయనున్నట్లు వినికిడి. అతను ప్రధాన విరోధి పాత్ర పోషిస్తాడని అనుకోవచ్చు.

Exit mobile version