మాలీవుడ్ దర్శకుల్లో టక్కున గుర్తొచ్చే పేరు జీతూ జోసెఫ్. దృశ్యం సినిమాతో సౌత్ ఇండస్ట్రీ మాత్రమే కాదు నార్త్ ఇండస్ట్రీలోను ఈ స్టార్ దర్శకుడి పేరు మారుమోగింది. ఇప్పుడు ఆయన తీయబోయే దృశ్యం 3 కోసం బాలీవుడ్ టూ మాలీవుడ్ ఆడియన్స్ వరకు అందరు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ కాస్త ఆలస్యం అయ్యాలా ఉంది. కానీ ఈ లోగా దృశ్యం 3 సినిమా కన్నా ముందే మిరాజ్ అనే మరో థ్రిల్లర్ మూవీని తీసుకురాబోతున్నాడు జీతూ జోసెఫ్. లాస్ట్ ఇయర్ భారీ హిట్ అందుకున్న కిష్కింద కాండం పెయిర్ ఆసిఫ్ అలీ, అపర్ణా బాల మురళి మరోసారి జోడీ కడుతున్నారు.
Also Read : Tollywood : తెలుగులోకి సైలెంట్ గా వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టిన డబ్బింగ్ సినిమా
సైకాలజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న మిరాజ్ మాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది యాంటిసిపెటెడ్ మూవీ. ఇప్పటికే టీజర్ ఇంట్రస్ట్ క్రియేట్ చేయగా థియేటర్లలో ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న థ్రిల్లర్ ఫ్యాన్స్ కోసం ఓనమ్ పండుగ సందర్భంగా రిలీజ్ డేట్ చెప్పేశారు మేకర్స్. సెప్టెంబర్ 19న థియేటర్లలోకి రాబోతుంది మిరాజ్. ఈ మధ్య కాలంలో సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు తీసి బోర్ కొట్టేస్తుందని స్టేట్ మెంట్ పాస్ చేసిన జీతూ జోసెఫ్ నెక్ట్స్ దృశ్యం3ను దృశ్యం వన్ అండ్ 2కి డిఫరెంట్ గా తీయబోతున్నాడట. ఇప్పటికే స్టోరీ కంప్లీట్ చేయగా తెలుగు, హిందీ, మలయాళంలో వెంకటేశ్, అజయ్ దేవగన్, మోహన్ లాల్‌తో తెరకెక్కించనున్నాడు. అయితే 2020లో లాలట్టన్‌తో రామ్ అనే భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ స్టార్ట్ చేశారు. కానీ ఎంత వరకు కంప్లీటైందో అప్డేట్ లేదు. రెండు పార్టులుగా తెరకెక్కిస్తోన్న ఈ ఫిల్మ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వల్ల డిలే అవుతుందని టాక్.
