NTV Telugu Site icon

Tamil cinema: ఆగస్టు రేసులోకి మరో సినిమా..రిలీజ్ ఎప్పుడంటే..?

Untitled Design (32)

Untitled Design (32)

తమిళ హారర్ చిత్రాల‌కు తెలుగులో మంచి ఆదరణ  ఉంటుంది. గతంలో వచ్చిన చంద్రముఖి, పిజ్జా, పిజ్జా 2, 13బి, కాంచన సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద సూపర్ కలెక్షన్స్ రాబట్టాయి. అదే కోవలో వచ్చిన మ‌రో కోలీవుడ్ చిత్రం ‘డెమోంటే కాలనీ. 2015లో ఎటువంటి అంచనాలు లేకుండా తెలుగులో విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా వచ్చిన 8 ఏండ్ల త‌ర్వాత సీక్వెల్‌ను అనౌన్స్ చేశారు మేక‌ర్స్. ‘డిమాంటే కాలనీ’ సిక్వెల్ గా డిమాంటే కాలనీ-2  తెరకెక్కించారు. ఈ సిక్వెల్ కు అజయ్ ఆర్ జ్ఞానముత్తి రచన మరియు దర్శకత్వం వహించారు. ఇందులో అరుళ్‌నితి, ప్రియా శంకర్‌లు హీరో,హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల్లో ఆదరణ దక్కించుకుంది.

 

కాగా ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఆగస్టు 15న అటు తమిళ్ తో పాటు తెలుగులో రిలీజ్ కానుంది డిమోంటే కాలనీ 2. అదే రోజు  తెలుగులో ఇప్పటికే  5 చిత్రాలు రానుండగా వాటితో పోటీపడనుంది ఈ చిత్రం. అటు తమిళ్ లోను 4చిత్రాలతో పోటీపడనుంది. ఇదిలా ఉండగా ఈ ఏడాది ప్రియా భవాని శంకర్ నటించిన ఇండియన్ 2, భీమా, రత్నం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ లుగా మిగిలాయి. దాంతో హిట్ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న డిమోంటే కాలనీ 2పై ఎన్నో ఆశలు పెట్టుకుంది ప్రియా భవాని శంకర్. ఇస్మార్ట్, బచ్చన్ వంటి  భారీ చిత్రాల మధ్య తెలుగులోనూ విడుదలవుతున్న ఈ చిత్రం టాలీవుడ్ ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పిస్తుందో.

Also Read:Haromhara: అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్, దేశవ్యాప్తంగా ట్రెండింగ్..

Show comments