Site icon NTV Telugu

ArjunDas : ప్రేమవలలో అర్జున్ దాస్?.. ప్రియురాలు ఎవరంటే?

Arjundas

Arjundas

కోలీవుడ్‌లో ఓ వైపు స్టార్స్ జోడీలు విడిపోతుంటే మరో వైపు సరికొత్త ప్రేమ కథలు బయటకు వస్తున్నాయి. ధ్రువ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్ మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందంటూ రూమర్ గట్టిగానే వినిపించింది. ఇద్దరూ ఔనని చెప్పలేదు కాదని అనలేదు. ఇక కోలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌లో ఒకరైన విశాల్ సోలో లైఫ్‌కు గుడ్ బై చెప్పబోతున్నాడు. నటి సాయి ధన్సికతో త్వరలో ఏడడుగులు వేయబోతున్నట్లు అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చేశాడు విశాల్.

Also Read : Film News : 3 ఇండస్ట్రీలు.. 3 క్రేజీ వార్తలు..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మరోసారి ప్రేమలో పడ్డాడంటూ వార్తలు రీసెంట్లీ రాగా వీటికి చెక్ పెట్టింది మృణాల్ ఠాకూర్. మేమిద్దం జస్ట్ ఫ్రెండ్స్ అంటూ కవర్ చేసుకుంది. అయితే ఇప్పుడు మరో లవ్ స్టోరీ తమిళనాడు సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అర్జున్ దాస్ – ఐశ్వర్య లక్ష్మీ ప్రేమలో ఉన్నారన్నది లేటెస్ట్ బజ్. యాక్చువల్లీ ఈ రూమర్ గతంలోనూ వినిపించగా అప్పట్లో ఖండించారు. కానీ మళ్లీ ఇద్దరూ కలిసి ఓ వెబ్ సిరీస్‌తో పాటు మూవీ కూడా చేస్తుండటంతోనే ఈ రూమర్స్ వస్తున్నాయి.  ఆర్జే నుండి యాక్టర్‌గా అర్జున్ దాస్ యూటర్న్ తీసుకోగా ఐశ్వర్య లక్ష్మీ డాక్టర్ చదివి యాక్టర్ అయ్యింది. అర్జున్ తన పెక్యూలర్ వాయిస్‌తో ఫేమస్ కాగా, ఐశ్వర్య సెలక్టివ్ స్టోరీలతో మంచి పేరు తెచ్చుకుంది. ప్రజెంట్ ఆమె తెలుగులో సాయి తేజ్ సరసన సంబరాల ఏటి గట్టు చేస్తోంది. ఇటు అర్జున్ దాస్ కూడా ఓజీలో కనిపించబోతున్నాడు. అసలు జీవితంలో పెళ్లే చేసుకోను అంటూ పలుమార్లు స్టేట్ మెంట్ ఇచ్చిన ఐశ్వర్య ప్రేమ జోలికి వెళుతుందా ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే గాని క్లారిటీ రాదు.

Exit mobile version