టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కోలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో ధనుష్ తో సినిమా తీయబోతున్నట్టు గత నెల ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై ఆసక్తి అంచనాలతో పాటు పలు ఊహాగానాలు కూడా జోరందుకున్నాయి. అమెరికా నుంచి ఇటీవలే హైదరాబాద్ చేరుకున్న ధనుష్ ను మరోసారి కలిసి శేఖర్ కమ్ముల ఫైనల్ స్క్రిప్ట్ గురించి చర్చించారు. సినిమా నిర్మాతలతో శేఖర్ కమ్ముల, ధనుష్ కలిసి ఉన్న పిక్స్ నెట్టింట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
Read Also : సొంత ఓటిటిని లాంచ్ చేయనున్న మరో రాష్ట్రం
పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మరో పాపులర్ హీరో కనిపించనున్నాడట. ఈ సినిమా రొమాంటిక్ డ్రామాగా రూపొందనుందని, ఇందులో ధనుష్ తో పాటు మరో హీరో కూడా నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజం ఎంతో తెలియాలంటే మేకర్స్ స్పందించాల్సిందే. ఈ వార్త నిజమో కాదో మనం చూడాలి. కాగా శేఖర్ కమ్ముల తన తాజా చిత్రం “లవ్ స్టోరీ”తో ప్రేక్షకులను రొమాంటిక్ లవ్ ఫీలింగ్ లోకి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.