AA23 : అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో మరొక హీరో.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య వచ్చిన పుష్ప2 సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు తిరుగులేని విజయాన్ని అందించింది. అంతేకాదు హిందీలో బన్నీకి భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. దీంతో పాన్ ఇండియా లెవల్లో అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. త్రివిక్రమ్ తో సినిమా చేయాల్సి ఉండగా మధ్యలో తమిళ డైరెక్టర్ అట్లీ ప్రాజెక్ట్ వచ్చి చేరింది.
Also Read : 97th Oscars : ఆస్కార్ 2025 విజేతల లిస్ట్ ఇదే..
Also Read
జవాన్ సూపర్ హిట్ తర్వాత మరో సినిమా చేయని అట్లీ, ఐకాన్ స్టార్ కోసం కథ రెడీ చేసాడట. ఇటీవల అల్లు అర్జున్ ను కలిసిన అట్లీ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట బన్నీ. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారని, బన్నీ తో పాటు మరో తమిళ హీరో కూడా నటించబోతున్నట్టు తెలుస్తుంది. షూటింగ్ టైమ్లైన్లు మరియు ఇతర లాజిస్టికల్ అంశాలపై అట్లీ టీమ్ కసరత్తులు చేస్తోంది. ఏప్రిల్ లేదా మే నాటికి ప్రీ-ప్రొడక్షన్‌ని ప్రారంభించాలని చూస్తున్నాడుట అట్లీ. ఈ సినిమాను తమిళ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిచర్స్ దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించనున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తారని చెన్నై సినీవర్గాల టాక్. అందులో ఒక హీరోయిన్ గా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే తమిళ లేటెస్ట్ సెన్సేషన్ అభయంకర్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. అట్లీ, అల్లు అర్జున్ కాంబో మాస్ ఫీస్ట్ గా ఉండబోతుందని ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇస్తుందని ఇన్ సైడ్ టాక్.
తాజావార్తలు
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!