NTV Telugu Site icon

AA23 : అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో మరొక హీరో.?

Aa 23

Aa 23

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య వచ్చిన పుష్ప2 సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు తిరుగులేని విజయాన్ని అందించింది. అంతేకాదు హిందీలో బన్నీకి భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. దీంతో పాన్ ఇండియా లెవల్లో అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. త్రివిక్రమ్ తో సినిమా చేయాల్సి ఉండగా మధ్యలో తమిళ డైరెక్టర్ అట్లీ ప్రాజెక్ట్ వచ్చి చేరింది.

Also Read : 97th Oscars : ఆస్కార్‌ 2025 విజేతల లిస్ట్ ఇదే..

జవాన్ సూపర్ హిట్ తర్వాత మరో సినిమా చేయని అట్లీ, ఐకాన్ స్టార్ కోసం కథ రెడీ చేసాడట. ఇటీవల అల్లు అర్జున్ ను కలిసిన అట్లీ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట బన్నీ. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారని, బన్నీ తో పాటు మరో తమిళ హీరో కూడా నటించబోతున్నట్టు తెలుస్తుంది. షూటింగ్ టైమ్‌లైన్‌లు మరియు ఇతర లాజిస్టికల్ అంశాలపై అట్లీ టీమ్ కసరత్తులు చేస్తోంది.  ఏప్రిల్ లేదా మే నాటికి ప్రీ-ప్రొడక్షన్‌ని ప్రారంభించాలని చూస్తున్నాడుట అట్లీ. ఈ సినిమాను తమిళ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిచర్స్ దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించనున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తారని చెన్నై సినీవర్గాల టాక్. అందులో ఒక హీరోయిన్ గా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే తమిళ లేటెస్ట్ సెన్సేషన్ అభయంకర్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. అట్లీ, అల్లు అర్జున్ కాంబో మాస్ ఫీస్ట్ గా ఉండబోతుందని ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇస్తుందని ఇన్ సైడ్ టాక్.