టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ ఇటీవలే “ఏక్ మినీ కథ”తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో ఆయన నటనకు ప్రశంసలు కురిశాయి. ఈ చిత్రం హిట్ ఇచ్చిన జోష్ తో ప్రస్తుతం సంతోష్ వరుసగా రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో ఒకటి ప్రముఖ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇందులో మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది.
Read Also : హిట్ ఇచ్చిన దర్శకుడితో మరోసారి కళ్యాణ్ రామ్
సంతోష్ హీరోగా రానున్న రెండవ చిత్రానికి టాలెంటెడ్ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు. స్వప్న సినిమా, మిత్ర వింద మూవీస్ బ్యానర్లపై ప్రియాంక దత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చుతున్నారు. ఈ చిత్రంలో ఇందులో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, రావు రమేష్, నరేష్, గౌతమి, రాజేంద్ర ప్రసాద్ ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ ను ప్రకటిస్తూ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు “అన్నీ మంచి శకునములే” అనే టైటిల్ ను ఖరారు చేశారు.
