NTV Telugu Site icon

Anjali: ఈ సినిమాలో నాకు అదే పెద్ద కనెక్షన్ !

Anjali Comments

Anjali Comments

రాజోలు అమ్మాయి హీరోయిన్ అంజలి గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసింది. హలో రాజమండ్రి అంటూ మొదలుపెట్టిన ఆమె ఎంత హ్యాపీగా ఉందో అంటూ పేర్కొన్నారు. అంజలి మాట్లాడుతూ…. ఎక్కడెక్కడో గేమ్ చేంజర్ మూవీ కోసం ఈవెంట్స్ చేసాం… కానీ రాజమండ్రిలో చేస్తే వచ్చే ఆ కిక్కే వేరప్పా… చాలా హ్యాపీగా ఉంది.. ఈ క్రౌడ్ చూసి. నేను ఇక్కడి నుంచి వెళ్లి ఒక నటిగా మారి మళ్ళీ ఇక్కడికి అదే హోదాలో గేమ్ చేంజర్ అనే ఒక సినిమా చేసి రావడం అనేది నాకు చాలా ఆనందం కలిగించే విషయం… దానికి ధన్యవాదాలు.. ముందుగా ఈ సినిమా గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి మీద నాకు చాలా అపారమైన గౌరవం ఉంది. వకీల్ సాబ్ లో ఆయనతో కలిసి సినిమా చేసినప్పుడు ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఆయన మరింత పెద్ద స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను.. ఆయన ఇక్కడికి వస్తున్నందుకు థాంక్స్ చెబుతున్నాను.

Atul Subhash Case: బెంగళూర్ టెక్కీ సుభాష్ సూసైడ్ కేసు.. భార్య నిఖితా సింఘానియాకు బెయిల్..

గేమ్ చేంజర్ గురించి చెప్పాలని నేను చాలా అనుకున్నాను కానీ స్టేజ్ పైకెక్కి మైక్ పట్టుకున్నాక మొత్తం మర్చిపోయాను. జీవితంలో నటిగా ఇలాంటి ఇలాంటి పాత్రలు చేయాలనుకుంటాం.. అలాంటి పాత్ర నేను ఈ సినిమాల్లో చేశాను. మా అమ్మ పేరు పార్వతి ఈ సినిమాలో నేను చేసిన పాత్ర పేరు పార్వతి.. ఇది నాకు బాగా కనెక్ట్ అయిన విషయం.. శంకర్ గారు దాదాపు అందరికీ ఫేవరెట్ డైరెక్టర్ అయి ఉంటారు. నాకు కూడా ఫేవరేట్. అలాంటి ఆయన దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నాకు ఇలాంటి పాత్ర దొరకడం నా అదృష్టం. మీతో పని చేస్తున్నందుకు చాలా గౌరవంగా, గర్వంగా ఉందని అంటూ పేర్కొంది. మనం చాలామంది నటీనటులతో పనిచేస్తాం కానీ కొంతమందితో కలిసి చేసినప్పుడు కంఫర్టబుల్ గా ఉంటుందని తెలిపారు. మనకు హెల్ప్ అవుతుందనే ఒక ఫీలింగ్ ఉంటుంది… అలాంటి వారిలో రామ్ చరణ్ ముందు వరుసలో ఉంటారు అంటూ అని చెప్పుకొచ్చింది.

Show comments