Site icon NTV Telugu

Anirudh : అనిరుధ్‌కు వార్నింగ్ ఇస్తున్న ఆడియన్స్..?

Anirudh

Anirudh

తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ పేరు వినగానే హిట్ గ్యారెంటీ అనే నమ్మకం ఉండేది. ఎందుకంటే ఆయన కంపోజ్ చేసిన ఆల్బమ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోసేవి. అందుకే ఆయన నుంచి మ్యూజిక్ వస్తుందంటే ఆ సినిమాకు అదనపు బజ్ క్రియేట్ అవుతుందనేది నిజం. అందుకే భాష తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు అనిరుధ్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.. కానీ

గత కొంతకాలంగా అనిరుధ్ ఇచ్చిన ఆల్బమ్స్ ఆ అంచనాలకు తగ్గట్లుగా లేకపోవడంపై చర్చ మొదలైంది. మొదట రజనీకాంత్ నటించిన ‘వెట్టయన్’ చిత్రం తో ఈ విమర్శలు మొదలవ్వగా. ఆ తర్వాత అజిత్ హీరోగా వచ్చిన ‘విడాముయార్చి’ ఆల్బమ్ కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. తాజాగా విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ చిత్రానికి ఇచ్చిన మ్యూజిక్‌పై కూడా ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేశారు. ఇక రీసెంట్‌గా రిలీజ్ అయిన రజనీకాంత్–లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ‘కూలీ’ కూడా అనిరుధ్‌కు చేదు అనుభవం మిగిల్చింది. సినిమా హైప్, కంటెంట్ విషయం పక్కన పెడితే, ఈ సినిమాలో ఆయన మ్యూజిక్‌ స్పెషల్‌గా నిలవలేదన్న మాట ఎక్కువగా వినిపిస్తోంది. ఇలా వరుస సినిమాల్లో అనుకున్నంత మేజిక్ చేయలేకపోవడం వల్లే, ఆడియన్స్ ఇప్పుడు అనిరుధ్‌కి ‘మ్యూజిక్‌లో కొత్త ధనం తీసుకురా, లేదంటే మరీ మామూలుగా మారిపోతావు’ అన్న సంకేతం ఇస్తున్నారని ఇండస్ట్రీలో టాక్. మరి అనిరుధ్ ఈ వార్నింగ్స్‌ని సీరియస్‌గా తీసుకుని తిరిగి తన మార్క్ మ్యూజిక్‌తో అలరిస్తారా? లేకపోతే ఈ నెగెటివ్ వేవ్ కొనసాగుతుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరి దీని అనిరుధ్ సీరియస్‌గా తీసుకుంటారా? లేదా అనేది చూడాలి.

Exit mobile version