Site icon NTV Telugu

Anirudh: ఇదేంట్రా అయ్యా.. చాట్ జీపీటీతో అనిరుధ్ మ్యూజిక్?

Anirudh

Anirudh

‘నేనేప్పుడూ మీ బక్కోడినే’ అంటూ తెలుగు ఆడియన్స్ లవ్‌కు ఫిదా అయిన కోలీవుడ్ స్టార్ కంపోజర్ అనిరుధ్, కింగ్డమ్ ఈవెంట్‌లో ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇది. నిజమే… తక్కువ టైంలో అనిని తమ బ్రదర్‌గా ఓన్ చేసుకుంది టాలీవుడ్. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, తన స్టెప్ ఇచ్చేస్తున్నాడు. ఇతను ఇస్తున్న సాంగ్స్, ట్యూన్స్, బీజీఎం — యూత్‌ను కట్టిపడేస్తున్నాయన్న విషయమై ఎలాంటి సందేహం లేదు. కానీ, సమ్‌టైమ్స్ట్యూ న్స్ తస్కరిస్తున్నాడన్న అపవాదూ అనిరుధ్ మూటగట్టుకుంటున్నాడు. ఒకసారి కాదు… అతడు వర్క్ చేస్తున్న ప్రతి సినిమాకు ఏదో ఒక క్యాపీ క్యాట్ వివాదం తలెత్తుతోంది.

Also Read:Film Federation : సంచలనం.. సోమవారం నుంచి షూటింగ్స్ బంద్..?

జైలర్ మూవీలో “జుజుబీ” సాంగ్ వచ్చినప్పుడు బాలీవుడ్ మూవీ ఫాంతమ్ నుండి కాపీ కొట్టాడని, బీజీఎం మరో మూవీ నుండి తస్కరించాడన్న టాక్ వచ్చింది. ఇక దేవరలో “చుట్టమల్లే” సాంగ్ అయితే చెప్పనక్కర్లేదు — శ్రీలంక సాంగ్ మనికే మాగే హితే నే కొట్టేశాడన్న విమర్శలు వచ్చాయి. ఇక ఇటీవల కూలీ మూవీ నుండి వచ్చిన “పవర్ హౌస్” సాంగ్ కూడా ఓ అమెరికన్ ర్యాపర్ కంపోజ్ చేసిన పాటకు దగ్గరగా ఉందన్న టాక్ నెట్టింట వైరల్ అయ్యింది. ఇలా గత సినిమాల్లో అడ్డంగా దొరికిపోవడంతో, ఈసారి నెటిజన్లకు ఆ చాన్స్ ఇవ్వదలుచుకోలేదనిపిస్తుంది అనిరుధ్.

Also Read:Mrunal Thakur: డెకాయిట్ కోసం మృణాల్ ఎదురుచూపులు!

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ — చాట్ జీపీటీ సాయంతో పాటలు కంపోజ్ చేస్తున్నానంటూ తెలిపారు. ఓ పాట కంపోజ్ చేస్తుండగా, చివరి రెండు లైన్ల దగ్గర స్టక్ అయ్యాక… చాట్ జీపీటిని ఆశ్రయించాడట. ఇప్పటికే రెడీ చేసిన లైన్లన్నింటినీ చాట్ జీపీటీలో ఇచ్చి, సజెషన్స్ అడిగాడట. దాంతో మోడల్ చాలా ఆప్షన్స్ ఇచ్చిందట. అయితే ఇది ట్యూన్స్ కోసమా, లిరిక్స్ కోసమా అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో నెటిజన్లు – “ఈసారి గ్రోక్‌ని అడుగు” అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. కొత్త ఐడియాల కోసం ఏఐ లేదా చాట్ జీపీటీని ఆశ్రయించడం తప్పు కాదని కొంతమంది మద్దతు కూడా పలుకుతున్నారు. ఈ లెవల్లో క్యాపీ క్యాట్ వివాదంలో చిక్కుకున్న బక్కోడు, కూలీ రూపంలో రజనీకి హిట్టిస్తాడో లేదో చూడాలి…!

Exit mobile version