Site icon NTV Telugu

Anil Ravipudi: ట్రోలింగ్‌పై డైరెక్టర్ అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్..

Anil Ravipudi

Anil Ravipudi

Anil Ravipudi: అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించగా, నయనతార హీరోయిన్‌గా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజ్ కానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ట్రోలింగ్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

READ ALSO: Asaduddin Owaisi: హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని కావడమే నా కల.. రాజ్యాంగంపై కీలక వ్యాఖ్యలు..!

దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘హ్యూమిలినేషన్, డీమోటివేషన్, లేకపోతే ఇంకోటి ఇంకోటి నేను అడ్రస్ చేయను. నేను ఇది అడ్రస్ చేయడం స్టార్ చేశానంటే నా ఆడీయన్స్‌కు నన్ను నేను ఇది చెప్పదల్చు కోవాల్సి వస్తుంది. కానీ నేను అది చేయను. దానికి బదులుగా నా ఆడీయన్స్‌ ముందు ఒక అద్బుమైన కంటెంట్ తీసుకొచ్చి పెడతాను.. వాళ్లకు ఆ సినిమా నచ్చితే చూస్తారు. చూడని రోజు నన్ను నేను కరెక్ట్ చేసుకుంటాను. ఈ రెండే నాకు ఉన్నాయి. ఇవి ఎంతైనా తీసుకోడానికి నేను రడీ. అలాగే ఇప్పుడు ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, అది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది నాకు ఒక అంచనా ఉంది. అలాంటి టైంలో ఈ ట్రోలింగ్ అనేది నాకు చాలా చిన్నగా కనిపిస్తుంది. నాకు అగ్రతాంబుళం ఇవ్వాల్సింది సినిమాను చూసిన ప్రేక్షకులు, కానీ సినిమాను అసలు చూడకుండా 24 గంటలు నన్ను తిట్టే వారు నాకు అగ్రతాంబుళం ఇవ్వాలని నేను ఎందుకు అనుకుంటాను. అలాంటి వాళ్లను వద్దురా బాబు మీరు తిట్టుకోండి.. అని వదిలేస్తా.

అలాగే ఆయన తన ఎనర్జీకి సంబంధించిన సీక్రెట్‌ను రివీల్ చేస్తూ.. ఈ ట్రోలింగ్ లాంటివన్నీ నేను భరించడానికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే.. నేను ఈ రోజు జనంలోకి వెళ్తే, మాల్స్‌కు వెళ్లిన, పబ్లీక్ కార్యక్రమాలకు వెళ్లిన, తిరుపతి వంటి ప్రదేశాలకు వెళ్లిన 6 ఏళ్ల పాప నుంచి 65 ఏళ్ల బామ్మ వరకు అందరూ నన్ను పిలిచి, ఆప్యాయంగా పలకరించి నీ సినిమా బాగుందని, నీ కొత్త సినిమా ఎప్పుడు వస్తుందని అడుగుతారు. ఇదే నా ఎనర్జీకి సీక్రెట్ అని వెల్లడించారు. దీని ముందు ఈ ట్రోలింగ్ అనేది పెద్ద విషయం కాదని చెప్పుకోచ్చారు.

READ ALSO: Shubman Gill: వాళ్ల వల్లనే సెలక్ట్ కాలేదు: శుభ్‌మన్ గిల్

Exit mobile version