Site icon NTV Telugu

Nayanathara : నయనతారను కలిసేందుకు వెళ్లిన అనిల్ రావిపూడి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఈ సినిమా టైటిల్‌ను ఫిక్స్ చేయలేదు, కానీ దాదాపుగా స్క్రిప్ట్ లాక్ అయింది. హీరోయిన్‌ను కూడా ఫైనల్ చేశారు. నయనతార ఈ సినిమాలో హీరోయిన్‌గా కనిపించబోతోంది. మరో హీరోయిన్‌గా కేథరిన్ థెరిస్సా కనిపించబోతోంది. అయితే, ఇప్పటికే నయనతారకు కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ తీసుకున్న అనిల్ రావిపూడి, తాజాగా ఆమెను కలిసేందుకు చెన్నై బయలుదేరి వెళ్లారు.

Read More: The Paradise : ప్యారడైజ్ లో నాని సరసన యూత్ ఫేవరెట్ హీరోయిన్..?

ఈ రోజు ఉదయమే అనిల్ చెన్నై వెళ్లినట్లుగా తెలుస్తోంది. అక్కడ ఆమెతో స్టోరీ సిట్టింగ్స్ జరగబోతున్నాయని అంటున్నారు. ఇక ఈ సినిమా కోసం నయనతార 18 కోట్లు డిమాండ్ చేసిందని, చివరికి 12 కోట్లకు ఫైనల్ చేశారని ప్రచారం కూడా ఉంది. కానీ, అందులో ఎంతవరకు నిజం ఉందనే విషయంపై క్లారిటీ లేదు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటితో కలిసి, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ స్పాన్సర్‌పై మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి అనేక లీక్స్ బయటకు వస్తున్నాయి, కానీ ఏవి నమ్మాలో, ఏవి నమ్మకూడదో ప్రస్తుతానికి క్లారిటీ లేదు.

Exit mobile version