Site icon NTV Telugu

Anil Kapoor: తమ్ముడికి ప్రేమతో… అనిల్ కపూర్!

Anil Kapoor Sanjay

Anil Kapoor Sanjay

Anil Kapoor Shares Rare Pics Of Sanjay Kapoor On His 60th Birthday: బోనీ కపూర్, అనిల్ కపూర్ తమ్ముడు సంజయ్ కపూర్ గుర్తుండే ఉంటారు. సోమవారం సంజయ్ కపూర్ 60వ బర్త్ డే జరుపుకున్నాడు. దాంతో అనిల్ కపూర్ తమ్ముడిని అభినందిస్తూ తన సోషల్ మీడియా అకౌంట్ లో విషెస్ చెబుతూ, కొన్ని రేర్ పిక్స్ కూడా పోస్ట్ చేశారు. అందులో తన తమ్ముడిపై ప్రేమ కురిపిస్తూనే, తన తల్లిని సంజయ్ జాగ్రత్తగా చూసుకొనే తీరునూ గుర్తు చేశారు అనిల్. ఓ ఫోటోలో మీసాలు లేని సంజయ్ కపూర్, తన అన్నలు బోనీ కపూర్, అనిల్ కపూర్ తో ఉన్న పిక్ ఫ్యాన్స్ ను భలేగా ఆకట్టుకుంటోంది. అలాగే అమితాబ్ బచ్చన్, జుహీ చావ్లా వంటి వారితో సంజయ్ ఉన్న మరో ఫోటో కూడా మురిపిస్తోంది. ఇక తన అన్న అనిల్ కపూర్ కూతురు సోనమ్ తో ఆమె చిన్నప్పుడు ఉన్న ఫోటో సైతం ఫ్యాన్స్ ను కట్టిపడేస్తోంది. ఇలా సంజయ్ కపూర్ పై అభిమానాన్ని కురిపించారు అనిల్. అన్న అనిల్ కపూర్ విషెస్ కు సంజయ్ కూడా స్పందిస్తూ “లవ్ యూ టూ” అంటూ కృతజ్ఞత కురిపించారు.

బోనీ కపూర్ తన తమ్ముళ్ళు ఇద్దరినీ స్టార్స్ గా చూడాలని ఆరాటపడ్డారు. అదే తీరున అనిల్ కపూర్ స్టార్ హీరోగా రాజ్యమేలారు. అయితే చిన్నతమ్ముడు సంజయ్ తోనూ బోనీ కొన్ని సినిమాలు తీశారు. వాటిలో సంజయ్ ను హీరోగా పరిచయం చేస్తూ తీసిన ‘ప్రేమ్’ భలేగా ఆకట్టుకుంది. అయితే ఆ సినిమా తరువాత వచ్చిన ఇంద్రకుమార్ నిర్మించి, దర్శకత్వం వహించిన ‘రాజా’ దానికన్నా మిన్నగా విజయం సాధించింది. ఆ మధ్య ఓటీటీ ప్లాట్ ఫామ్ లో తన ‘రాజా’ నాయిక మాధురీ దీక్షిత్ తో కలసి ‘ద ఫేమ్ గేమ్’లోనూ సంజయ్ అలరించారు. అలాగే సంజయ్ ‘ద గాన్ గేమ్’లోనూ విలక్షణమైన పాత్రలో అలరించారు. ఇప్పటికీ తనదైన బాణీ పలికిస్తోన్న సంజయ్ కి ఆయన అన్న అనిల్ తో పాటు ఎంతోమంది అభిమానులు అభినందన జల్లుల్లో ముంచెత్తడం విశేషం!

Exit mobile version