Site icon NTV Telugu

Murali Mohan : లండన్‌కు రమ్మని పిలిస్తే డొక్కా సీతమ్మ వెళ్లలేదు!

Dokka Seetamma

Dokka Seetamma

మురళీ మోహన్, ఆమని ప్రధాన పాత్రధారులుగా ఉషారాణి మూవీస్ బ్యానర్ మీద వల్లూరి రాంబాబు, మట్టా శ్రీనివాస్ నిర్మాతలుగా టి.వి. రవి నారాయణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’. ఈ చిత్రానికి రాహుల్ శ్రీవాత్సవ్ కెమెరామెన్‌గా పని చేశారు. కార్తీక్ కొడకండ్ల సంగీతాన్ని అందించారు. ఎం. రవి కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. గతంలో రిలీజ్ చేసిన మూవీ టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఇక తాజాగా మురళీ మోహన్ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్‌ను, గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.

Also Read: Kannappa: ఏపీలో కన్నప్పకి టికెట్ రేట్ హైక్

ఈ క్రమంలో నిర్వహించిన కార్యక్రమంలో మురళీ మోహన్ మాట్లాడుతూ.. ‘నా పుట్టిన రోజు ఎప్పుడూ ఆశ్రమాల్లో చేసుకుంటూ ఉంటాను. దివ్యాంగులు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాను. ఈ రోజు కూడా అంధుల ఆశ్రమానికి వెళ్లాల్సి ఉంది. కానీ ఓ అరగంట వచ్చి వెళ్లమని ‘డొక్కా సీతమ్మ’ టీమ్ పిలిచింది. అందుకే ఇలా వచ్చాను. చిన్న నిర్మాతలే అయినా నా బర్త్‌డేను ఇలా సెలబ్రేట్ చేస్తున్నందుకు థాంక్స్. రేలంగితో నా అనుబంధం మరువలేనిది. రామ సత్యనారాయణ ఎంతో మంది నిర్మాతలకు అండగా నిలుస్తుంటారు. డొక్కా సీతమ్మ మీద సినిమా తీయాలని చాలా మంది అనుకున్నారు.

Also Read: Drugs Case : డ్రగ్స్ కేసులో ట్విస్ట్…నాకు సంబంధం లేదంటున్న నటుడు!

కాటన్ దొర సైతం డొక్కా సీతమ్మను పొగిడారు. సన్మానం చేస్తామని లండన్‌కు రమ్మని పిలిస్తే సైతం డొక్కా సీతమ్మ వెళ్లలేదు. ‘నేను అక్కడికి వస్తే ఇక్కడ వారి ఆకలి ఎవరు తీరుస్తారు?’ అని డొక్కా సీతమ్మ నిరాకరించారు. అలాంటి ఓ గొప్ప మనిషి మీద సినిమాను తీస్తుండటం ఆనందంగా ఉంది. ఇప్పుడు అంతా కమర్షియల్‌గా మారింది. ఇలాంటి టైంలో రాంబాబు, రవి నారాయణ ముందుకు వచ్చారు. ఇలాంటి చిత్రాలు పెద్ద విజయాన్ని సాధించాలి’ అని అన్నారు.

Exit mobile version