Site icon NTV Telugu

AKT : ఆంధ్రకింగ్ తాలుకా ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్

Akt

Akt

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా. మహేశ్ బాబు. పి  దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. డబుల్ ఇస్మార్ట్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత రామ్ నుండి రానున్న ఈ సినిమా  హీరోగా రామ్ కెరీర్ లో  22వ సినిమా.

Also Read : Bhagyashri Borse : భాగ్యశ్రీ ఖాతాలో మరో ప్లాప్.. కనికరం చూపని కాంత

ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టైటిల్ గ్లిమ్స్ కి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అలానే రామ్ స్వయంగా రాసిన నువ్వుంటే చాలే ఫస్ట్ సింగిల్ కు కూడా భారీ స్పందన తెచ్చుకుంది. రామ్ కెరీర్ లో భారీ బడ్జెట్ పై వస్తున్న ఈ సినిమా ఈ నెల నవంబరు 28న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. దాంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్. తాజాగా ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్ డేట్ ను ప్రకటించారు. ఈ నెల 18న ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. మరోవైపు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అమెరికాలో నవంబర్ 26న డల్లాస్ లో ఎర్లీ ప్రీమియర్‌ ను ప్రదర్శించనున్నారు. ఏ షోస్ కు హీరో రామ్ తో పాటు హీరోయిన్ భాగ్యశ్రీ ప్రేక్షకులతో కలిసి సినిమా చూడబోతున్నారు. మంచి అంచనాల మధ్య వస్తున్నఈ సినిమాకు వివేక్ శివ, మెర్విన్ సోలో మన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతో హిట్ కొట్టి ట్రాక్ లోకి వస్తానని రామ్ ధీమాగా ఉన్నాడు.

Exit mobile version