Site icon NTV Telugu

Andhra-King-Taluka : షూటింగ్‌ కంప్లీట్‌ – ప్రమోషన్లు స్టార్ట్‌..!

Andraking Taluka

Andraking Taluka

ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ పోతినేని హీరోగా నటిస్తున్న తాజా మాస్‌ ఎంటర్‌టైనర్‌ “ఆంధ్ర కింగ్‌ తాలూకా”. ఈ సినిమాకు పి. మహేష్ బాబు దర్శకత్వం వహిస్తుండగా, భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న.. ఈ మాస్‌ యాక్షన్‌ డ్రామా నవంబర్‌ 28, 2025న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఇప్పటికే చివరి షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తిచేయగా.. తాజా సమాచారం ప్రకారం మొత్తం షూటింగ్‌ను ముగించినట్లు యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. రామ్‌ కొత్త లుక్‌, కొత్త ఎనర్జీతో కనిపించబోతున్నాడని టాక్‌. సినిమా పూర్తి మాస్‌, యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ కలబోతగా ఉండబోతోందట.

Also Read : Sandeep Reddy : నేను డైరెక్టర్ అవ్వ‌డానికి కారణం ఈ మూవీనే – సందీప్ రెడ్డి వంగా

ఈ చిత్రంలో రావు రమేష్‌, మురళీ శర్మ, సత్య, వీటీవీ గణేష్‌లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అలాగే సౌత్‌ స్టార్‌ ఉపేంద్ర కూడా ఓ పవర్‌ఫుల్‌ రోల్‌లో కనిపించనున్నాడు. ఆయన పాత్ర సినిమా హైలైట్‌గా నిలుస్తుందనే ప్రచారం ఉంది. సంగీతంకు వస్తే, వివేక్ మెర్విన్‌ ద్వయం ఈ చిత్రానికి ట్యూన్స్‌ అందిస్తున్నారు. ఇప్పటికే రామ్‌ అభిమానులను విడుదలైన పటలు ఆకట్టుకోగా. రామ్‌ ఈసారి ఫుల్‌ కమర్షియల్‌ టచ్‌లో ప్రేక్షకులను అలరించబోతున్నాడని, సినిమా ట్రైలర్‌ విడుదలతోనే హైప్‌ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి అభిమానులు “ఆంధ్ర కింగ్‌ తాలూకా” బాక్సాఫీస్‌ వద్ద ఏ స్థాయి రికార్డు క్రియేట్‌ చేస్తుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version